Pickles: భారతదేశంలో ఇష్టంగా తినే పచ్చళ్ళలో ఆవకాయ ఒకటి. ఆవకాయ పచ్చడిని తలుచుకుంటే చాలు వెంటనే నోటిలో నీళ్లూరుతాయి. ప్రతి ఇంట్లో వేసవికాలం వచ్చిందంటే చాలు కచ్చితంగా ఆవకాయ పచ్చడి పెడుతూ ఉంటారు. ప్రతి ఊరిలో ఆవకాయ పచ్చడి అందుబాటులో ఉంటాయి. చాలామంది గ్రామాల నుంచి నగరానికి లేదా విదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పచ్చళ్ళను ప్యాక్ చేసుకుని తీసుకెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ రోజు ఊరగాయ పచ్చడి లేకుండా భోజనం చేయలేరు. Pickles

Important news for those who eat pickles

ఆవకాయ పచ్చడి ప్రతిరోజు తిన్నట్లయితే ఆరోగ్యానికి హాని కలిగించే లాక్టిక్ యాసిడ్ ఉంటుందని చాలా మందికి తెలియదు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఆవకాయ పచ్చడి ఎక్కువగా తినడం వల్ల బలహీనత, నొప్పులు, వాంతులు కలుగుతాయి. ముఖ్యంగా ఆవకాయ ఎక్కువగా తిన్నట్లయితే అధిక రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి. Pickles

Also Read: Shubman Gill: వివాదంలో గిల్… పీకల దాకా తాగి హీరోయిన్ తో చిందులు…?

ఆవకాయలో పులుపు ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా అరగదు. తద్వారా జీర్ణ క్రియ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇందులో ఆవపొడి, జీలకర్ర పొడి, కారం, వెల్లుల్లి, నూనె ఎక్కువగా వేసి ఆవకాయ పచ్చడిని చేస్తూ ఉంటారు. దీనివల్ల శరీరంలో అధికంగా కొవ్వు ఏర్పడుతుంది. ఎక్కువగా ఆవకాయ తిన్నట్లయితే పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. చాలామందికి ఆవకాయ తినడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి. Pickles

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆవకాయ పచ్చడిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఆవకాయ పచ్చడి శరీరానికి వేడి చేస్తుంది. దానివల్ల కడుపులోని బిడ్డ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందువల్లనే ఆవకాయ పచ్చడిని గర్భిణీ స్త్రీలు తినకూడదు. నేటి కాలంలో చాలామంది స్త్రీలు థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు పచ్చళ్ళు అస్సలు తినకూడదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Pickles