Moong Dal: నేటి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా పప్పు దినుసులు తినాలి. అందులో ముఖ్యంగా పెసరపప్పును వారంలో రెండు సార్లు అయినా తినాలని…. పెసరపప్పు తినడం వల్ల శరీరంలోని మానసిక ఒత్తిడి, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి. ఒత్తిడికి గురైన వారు ప్రతి రోజు ఆహారంలో పెసరపప్పును చేర్చుకోవచ్చు. Moong Dal

Moong Dal Benefits

ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి పెసరపప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా బాడీ అలసటకు గురైన సమయంలో పెసరపప్పు తప్పకుండా తినాలి. దీనిని తిన్నట్లయితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. Moong Dal

Also Read: Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ రద్దు..తాలిబన్ల అరాచకం ?

పెసరపప్పు శరీర జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తొలగించడానికి సహాయ పడుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా మంది వేడికి గురవుతారు. అలాంటివారు పెసరపప్పును తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు పెసరపప్పు తింటే డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న పోషకాలు డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. Moong Dal

ముఖ్యంగా చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో రకాల సాహసాలు చేస్తారు. అలాంటి వారు పెసరపప్పును తినడం వల్ల సులభంగా బరువును తగ్గుతారు. ఇందులో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. తద్వారా ఆకలి వేయదు. దీంతో బరువు క్రమంగా తగ్గుతారు. Moong Dal