Tollywood hero who tortured Hansika

Hansika: చబ్బీ చీక్స్ తో క్యూట్ క్యూట్ నవ్వుతో బాలనాటిగా బాలీవుడ్ లో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ బ్యూటీ ఎవరో మీకు ఇప్పటికే గుర్తొచ్చి ఉంటుంది.ఆమెనే మరాఠి బ్యూటీ హన్సిక మోత్వాని.. దేశముదురు మూవీతో హీరోయిన్గా సినిమాల్లో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులోవరుస సినిమాల్లో స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది.

Tollywood hero who tortured Hansika

అలా ఎన్టీఆర్ తో మొదలు సందీప్ కిషన్,నితిన్, రామ్ పోతినేని వంటి ఎంతోమంది హీరోలతో జతకట్టింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి తెలుగు ఇండస్ట్రీలో ఓ హీరో నుండి లైంగిక వేధింపులు ఎదురయ్యాయట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు.. హన్సికని నిజంగానే టార్చర్ చేశారా అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది నటీమణులు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ వంటి ఇండస్ట్రీలలో కాస్టింగ్ కౌచ్ ఉంటుంది.(Hansika)

Also Read: Aditi Rao Hydari: సిద్ధార్థ్ కాదు ఆ హీరో కోసం మొదటి భర్తను వదిలేసిన అదితి రావు హైదరి.?

కానీ తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉంటుంది అని అంటుంటారు.కానీ క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉంది.ప్రతి ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులను వేధించే చీడపురుగులు ఎంతో మంది ఉన్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపించదు. కానీ మొదటిసారి హన్సిక మోత్వాని నన్ను ఓ తెలుగు హీరో వేదించాడు అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

Tollywood hero who tortured Hansika

హన్సిక మోత్వాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను తెలుగులో ఓ సినిమాలో చేస్తున్న సమయంలో తెలుగు హీరో నన్ను వస్తావా.. నాతో డేటింగ్ చేస్తావా అంటూ వేధింపులకు గురి చేశాడు. అయితే ఆ టాలీవుడ్ హీరోకి నేను గట్టిగానే బుద్ధి చెప్పాను. నాదైన శైలిలో ఆయనకు వార్నింగ్ ఇచ్చేసరికి మళ్ళీ నా వంక చూడలేదు అంటూ హన్సిక చెప్పుకొచ్చింది. అయితే హన్సిక ఇప్పటివరకు ఇంతమంది తెలుగు హీరోలతో నటించింది. కాబట్టి ఎవరు హన్సికను వేధించింది అని కొంతమందిని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.(Hansika)