Fans Hope for a Stronger Role for Janhvi Kapoor in Upcoming Films

Janhvi Kapoor: ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ తెలుగు సినీ పరిశ్రమలో తన తొలి అడుగు వేసింది.

Fans Hope for a Stronger Role for Janhvi Kapoor in Upcoming Films

జాన్వీ కపూర్‌ తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఆమె పాత్రకు తగినంత ప్రాధాన్యం లేకపోవడం, కేవలం పాటలలో మాత్రమే కనిపించడం గురించి విమర్శలు వస్తున్నాయి. తొలి తెలుగు చిత్రంలో తన నటనను చూపించి మెప్పించాలని అనుకున్న జాన్వీకి ఈ సినిమా పెద్దగా అవకాశం ఇవ్వలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Nani Next Projects: నాని మార్కెట్ కి డబల్ బడ్జెట్ పెట్టాలంటే భయపడిపోతున్న నిర్మాతలు!!

ఇంతకుముందు కూడా జాన్వీ కపూర్‌కి తెలుగు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ, వివిధ కారణాలతో అవి కుదరలేదు. ఇప్పుడు ‘దేవర’లో అవకాశం వచ్చినా, దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయిందని భావిస్తున్నారు. జాన్వీ కపూర్‌ తన కెరీర్‌ తెలుగు లో దూసుకెళ్లాలంటే, భవిష్యత్తులో పాత్రల ఎంపికలో మరింత శ్రద్ధ వహించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

త్వరలోనే జాన్వీ, రామ్‌ చరణ్‌తో కలిసి నటించనున్న చిత్రం మొదలు కాబోతుంది. ఈ చిత్రంలో ఆమెకు మరింత ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కుతుందని, మంచి అవకాశం వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాని తో సినిమా చేయాలనే ఆలోచన ఆమె విరమించుకున్నట్లు తెలుస్తుంది. మంచి సినిమాల ఎంపిక నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. దానికి తోడు బడ్జెట్ ఇష్యూ వల్ల నిర్మాత ఆమెకు అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వలేకపోతున్నాడట. దాంతో ఆమె వెనుకడుగు వేయక తప్పట్లేదు.