Samantha: ఆ నిర్మాత సమంతకి 25 లక్షల తో పాటు ఫ్లాట్ కూడా.. అందరూ అనుకుంది నిజమైందిగా.?
Samantha: సమంత గతంలో ఓ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో సినిమా చేయడం కోసం 25 లక్షలు, ఓ ఫ్లాట్ రాయించుకుంది అనే రూమర్లు గతంలో వినిపించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆయనేనండి బెల్లంకొండ సురేష్ బాబు.. బెల్లంకొండ సురేష్ బాబు కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన అల్లుడు శీను మూవీలో సమంత హీరోయిన్గా చేసింది.
25 lakhs for that producer Samantha flat too
అయితే ఈ సినిమా వచ్చే సమయానికి సమంత స్టార్ నటి. ఆ టైంలో కొత్త హీరో అయినటువంటి బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన నటించాలంటే చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు. కానీ సమంత మాత్రం ఒప్పుకుందని దానికి కారణం బెల్లంకొండ సురేష్ బాబు రెమినరేషన్ తో పాటు ఒక ఫ్లాట్ కూడా రాసిచ్చాడు అనే రూమర్ వినిపించింది. అయితే ఈ రూమర్ నిజమే అన్నట్లుగా రీసెంట్ గా బెల్లంకొండ సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.(Samantha)
Also Read: Pushpa-2: పుష్ప-2 లో బాబాయ్ అంటూ పుష్పరాజ్ ని పిలిచిన ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఎందుకంటే సురేష్ బాబు రీసెంట్గా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. నేను అల్లుడు శీను సినిమా చేసే సమయంలో సమంతకి 25 లక్షలు ఇచ్చాను.ఆ టైంలో ఆమె చర్మ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతోంది. దాంతో ఆమె ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. కానీ నేను మాత్రం ఆమెకు ఆ డబ్బులు ఇచ్చాను.
అలాగే నాలుగు నెలల పాటు ఒక సపరేట్ ఫ్లాట్లో ఉండడానికి ఆశ్రయం కల్పించాను అంటూ చెప్పారు.అయితే ఈయన మాటలతో అప్పటి రూమర్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది.ఎందుకంటే సమంత అల్లుడు శీను సినిమా చేయడానికి నిర్మాత దగ్గర ఒక ఫ్లాట్ రాయించుకుందనే రూమర్ నిజమేనని మాట్లాడుకుంటున్నారు. కానీ బెల్లంకొండ సురేష్ బాబు మాత్రం నాలుగు నెలలు ఫ్లాట్లో ఉండడానికి ఆశ్రయం ఇచ్చానని మాత్రమే చెప్పారు.(Samantha)
https://www.instagram.com/p/DB-0qKBTbUb/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==