Pushpa-2: పుష్ప-2లో సుకుమార్ చేసిన 3 తప్పులు.. లేకుంటే మరో లెవల్.?

Pushpa-2: ఒకప్పుడు అల్లు అర్జున్ ని చూసి ఇండస్ట్రీలో చాలామంది నవ్వుకున్నారు. వీడి ముఖానికి హీరో అవుతాడా అని అన్నారట. అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందాడు. పుష్ప సినిమా ద్వారా ఇండియా మొత్తంలో పుష్పరాజ్ అయిపోయాడు. అలా పుష్ప మొదటి పార్ట్ తో అద్భుత విజయాన్ని సాధించినటువంటి అల్లు అర్జున్, రెండో పార్ట్ తో కూడా మంచి విజయాన్ని అందుకోబోతున్నట్టు తెలుస్తోంది.
3 mistakes made by Sukumar in Pushpa-2
అలాంటి పుష్ప సినిమాను సుకుమార్ మొదటి పార్ట్ కంటే, రెండో పార్ట్ చాలా ఇంట్రెస్ట్ పెట్టి తీశారట. సినిమా నిడివి పెరిగినా కానీ అద్భుతంగా ఉందంటూ ఎక్కడా కూడా బోరింగ్ లేదని ప్రేక్షకులు రివ్యూలు ఇస్తున్నారు. అంతా బాగున్నా కానీ ఆ మూడు విషయాల్లో డైరెక్టర్ సుకుమార్ కొన్ని మిస్టేక్స్ చేసినట్టు కొంతమంది రివ్యూలు చెబుతున్నారు.. ఇంతకీ అవి ఏంటయ్యా అంటే.. (Pushpa-2)
Also Read: Pushpa 2 Box Office Predictions: తొలిరోజు 300 కోట్లు పక్కా.. పుష్ప 2 కి భారీ ఓపెనింగ్స్!!
ఈ సినిమాలో సాగదీత సీన్లు ఎక్కువైపోయాయని, అలాగే విలన్ పాత్రలో అంతగా బలం లేదని, అలాగే మూడు గంటల సినిమా ఉండడంవల్ల కొంతమంది ప్రేక్షకులకు బోరు కొట్టేలా ఉందని అంటున్నారు. ఈ చిన్న మిస్టేక్స్ తప్ప సినిమాలో ఇంక ఏ పెద్ద మిస్టేక్ లేదని సినిమా మొత్తం అద్భుతంగా ఉందని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారని చెబుతున్నారు.

ఇందులో రష్మిక మందన మరో లెవల్ లో నటించిందని, అల్లు అర్జున్ కెరీర్ లోనే అద్భుతమైన సినిమాగా నిలవబోతుందని చెబుతున్నారు.. ప్రస్తుతం ఈ మూవీకి 3 రేటింగ్స్ ఇస్తూ, సోషల్ మీడియాలో అదరగొట్టేస్తున్నారు. మరి చూడాలి ఈ చిత్రం ఎంత వసూలు చేసి, ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో ముందు ముందు తెలుస్తుంది.(Pushpa-2)