IND vs PAK: ఈ ఏడాది మరో మూడు మ్యాచులు?


IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలోనే… పాకిస్తాన్ అలాగే టీమిండియా అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మరో 3 మ్యాచ్లు జరగబోతున్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో… ఈ సంవత్సరం మరో మూడు మ్యాచ్లు ఆడబోతుంది టీమిండియా. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆసియా కప్ 2025 లో అన్ని కుదిరితే ఇరుజట్లు మూడుసార్లు తలపడతాయని… జోరుగా ప్రచారం జరుగుతోంది.

3 more matches are going to be played between Team India vs Pakistan

గ్రూప్ దశలో ఒకసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుందట. అలాగే సూపర్ ఫోర్ దశలో మరొకసారి ఈ రెండు దేశాల మధ్య ఫైట్ ఉంటుంది. ఒకవేళ ఫైనల్ కు చేరితే మళ్ళీ పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య… బిగ్ ఫైట్ ఉంటుంది. ఇలా ఈ సంవత్సరం మూడు సార్లు… పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్లు ఉండబోతున్నాయి.

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఈసారి టి20 ఫార్మాట్లో జరగనుంది. శ్రీలంక లేదా యూఏఈ లో ఈ టోర్నమెంట్ నిర్వహించే ఛాన్సులు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఆసియా కప్ 2025 టోర్నమెంటు ప్రారంభం కాబోతుందని వార్తలు.. వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *