Wine Shop: మందుబాబులకు గుడ్ న్యూస్… గీత కులాలకు మరో 335 మద్యం దుకాణాలు ?
Wine Shop: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-26 మద్యం పాలసీలో భాగంగా గీత కులాలకు 335 మద్యం దుకాణాలను కేటాయిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాలు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలబడ్డాయి. అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 335 మద్యం షాపులను కేటాయిస్తూ అబ్కారి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వం రాష్ట్రంలో 3,396 వైన్ షాపులకు లైసెన్సులను జారీ చేసింది.
335 more liquor shops for Geetha castes
వాటిలో 10% దుకాణాలను గీత కులాలకు ఇచ్చింది. దీనివల్ల గౌడ, ఈడిగ, యాత, శెట్టి బలిజ, గౌండ్ల, గామల్ల, శెగిడి కులాలకు లబ్ధి చేకూరనుంది. కల్లుగీత కార్మికులకు ఆర్థికంగా చేయూతను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంది. మద్యం షాపులలో 10 శాతం రాయితీతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
షాపులకు ఆఫ్ లైన్, ఆన్లైన్ ద్వారా లేదా హైబ్రిడ్ విధానంలో దరఖాస్తును చేసుకోవచ్చు. అభ్యర్థులు తమకుల ధ్రువీకరణ పత్రాన్ని నేటివిటీ సర్టిఫికెట్ ను ఇవ్వాల్సి ఉంటుంది. షాపులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రాను తీయడం జరుగుతుంది. లైసెన్స్ గడవు 2026 సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంటుంది.