Shriya: స్టార్ హీరోలతో ఎఫైర్ నడిపిన శ్రియా.. కానీ పెళ్లి కోసం అంత టార్చర్..?
Shriya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్స్ గా కొనసాగిన హీరోయిన్లలో శ్రియ శరన్ కూడా ఒకరు.. ఈమె చేసిన చాలా చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సినిమా కెరియర్ లో కొనసాగుతున్నటువంటి శ్రియశరన్ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, పలు ఇండస్ట్రీలలో మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి ఈమె కెరియర్ మంచి పోసిషన్ లో ఉండగానే ఆండ్రి అనే విదేశీ వ్యక్తితో ప్రేమలో పడింది..

Shriya who had affair with star heroes but so much torture for marriage
అలాంటి ఈ స్టార్ హీరోయిన్ ఆండ్రిని పెళ్లి చేసుకోవడానికి చాలా సమస్యలు ఎదుర్కొందట..మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. తాజాగా శ్రీయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.. శ్రీయా ఆండ్రీని మొదటిసారిగా మాల్దీవ్స్ లోని ఒక ఈవెంట్ లో కలిసిందట.. ఈ సమయంలో శ్రీయ ఎవరో ఆండ్రికి తెలియదట.. ఇదంతా తెలియక ముందే ప్రేమలో పడ్డ ఆండ్రీ ఆ తర్వాత ఆమె నటి అని తెలుసుకున్నారట.. (Shriya)
Also Read: Ram Pothineni: యంగ్ హీరోయిన్ తో రామ్ పోతినేని డేటింగ్.. ముంబైలో సంసారం.?
వీరి లవ్ స్టోరీ ఏకంగా 15 సంవత్సరాల పాటు కొనసాగిందట..ఆ తర్వాత 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు.. వీరి పెళ్లికి ఆండ్రీ తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదట. దీంతో వీరిద్దరూ ఎవరికి చెప్పకుండానే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రేమ వివాహం చేసుకున్నారు.. వీరికి 2021 జనవరిలో ఒక ఆడపిల్ల కూడా జన్మించింది..

ఇలా ఎంతో స్టార్ స్టేటస్ సంపాదించిన శ్రీయాను పెళ్లి చేసుకోవడానికి ఆండ్రి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అంటే వారు ఎంత ధనవంతులై ఉంటారని నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.. ఏది ఏమైనా వీరు దశాబ్ద కాలానికి పైగా ప్రేమలో ఉండి చివరికి పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవిస్తున్నారు. అంతేకాకుండా శ్రియ ఇప్పటికి కూడా సినిమాల్లో నటిస్తూ టైం దొరికినప్పుడు అలా కుటుంబంతో గడుపుతూ పలు వేకేశన్స్ వెళ్లి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది..(Shriya)