Dasara 2024 Film Releases Fail to Attract Audiences

Dasara 2024: ఈ దసరా సీజన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. రజనీకాంత్ నటించిన “వేటైయన్”తో ప్రారంభమైన ఈ నిరాశ, డైరెక్ట్ తెలుగు సినిమాల వరకు కొనసాగింది. “వేటైయన్” మొదటి భాగం ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, రెండో భాగం నిడివి, ప్రీచీనెస్ కారణంగా ప్రేక్షకులను బోర్ కొట్టించింది. ఈ కారణంగా తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది.

Dasara 2024 Film Releases Fail to Attract Audiences

గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన “విశ్వమ్” కూడా నిరాశ పరిచింది. కొన్ని కామెడీ సీన్లు మాత్రమే కొంతమంది ప్రేక్షకులను నవ్వించినప్పటికీ, మిగతా సినిమా రొటీన్ కథ, బలహీన సన్నివేశాలతో నిండిపోయి, ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టలేకపోయింది. అలాగే, డబ్బింగ్ చిత్రాలు “మార్టిన్” మరియు “జిగ్రా” కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. “మార్టిన్” చిత్రంలోని ఓవర్ ది టాప్ యాక్షన్ సన్నివేశాలు, బలహీన కథ ప్రేక్షకులను నిరాశపర్చగా, అలియా భట్ నటించిన “జిగ్రా” కూడా ప్రేక్షకుల మనసులు గెలుచుకోలేకపోయింది.

Also Read: Sruthi Haasan: శృతిహాసన్ న్యూ** ఫోటోస్ వైరల్.?

చిన్న చిత్రాల విషయానికి వస్తే, సుహాస్ నటించిన “జానక ఐతే గణక” కోర్ట్ రూమ్ డ్రామాగా మెప్పించలేకపోయింది. సుధీర్ బాబు “మా నాన్న సూపర్ హీరో” కథ విషయానికి వస్తే బాగానే ఉన్నప్పటికీ, థియేటర్లలో మ్యాజిక్ చేయలేకపోయింది. ఈ చిత్రం ఓటీటీలో విజయవంతంగా ఆడుతుందని అంచనాలు ఉన్నాయి. మొత్తంగా ఈ దసరా విడుదలైన చిత్రాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోవడంతో, ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ దసరా సీజన్ మరోసారి నిరాశనే కలిగించింది, కేవలం స్టార్ కాస్ట్, పాటలపై ఆధారపడకుండా, మంచి కథ, కథనాలతోనే సినిమాలు విజయవంతం అవుతాయని మరోసారి రుజువైంది.