Tea: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఆహారంలో కల్తీ కలవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. అందువల్లనే ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. బయటి ఆహారాన్ని అస్సలు తినకూడదు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి టీ తాగడం అలవాటు ఉంటుంది. చాలామంది ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే టీ ని తప్పకుండా సేవిస్తారు. ఇక కొంతమంది అయితే మూడు లేదా నాలుగు సార్లు టీని తాగుతూ ఉంటారు. Tea

What are the health benefits of drinking tea

ఇలా తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు అనారోగ్యం కూడా కలుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది టీ ని తాగడం వల్ల స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు. కానీ కేవలం రెండు సార్లు మాత్రమే టీ ని తాగాలి. అంతకుమించి తాగినట్లయితే మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వదు. తద్వారా మనకి ఆకలి పుట్టదు. టీ తాగడం వల్ల హైపర్ టెన్షన్ వంటి సమస్యల నుంచి రిలీఫ్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడంతో పాటు శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. Tea

Also Read: KCR: కేసీఆర్ కు బిగ్ షాక్.. మరో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్.. లిస్ట్ ఇదే ?

అంతేకాకుండా ప్రతిరోజు రెండుసార్లు మాత్రమే టీని తాగడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. శరీరంలోని జీవ కణాలు పాడవకుండా కాపాడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. టీ తాగడం వల్ల జీర్ణాశయ వ్యవస్థల పనితీరు కూడా మెరుగుపడుతుంది. గుండె పనితీరు సక్రమంగా పనిచేస్తుంది. తలనొప్పి వంటి సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. కానీ రెండుసార్లకు మించి టీని తాగినట్లయితే శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. Tea

తద్వారా గుండె జబ్బులు, గుండె సమస్యలు వస్తాయి. అంతేకాకుండా గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. చాలామంది టీని ఎక్కువసార్లు తాగడం వల్ల శరీరంలో వేడి ఎక్కువ అయి మొటిమలు, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా శరీరం నల్లబడుతుంది. అందుకే పరిమితిని మించి టీ ని తాగకూడదని కేవలం ఒకటి రెండుసార్లు మాత్రమే ప్రతిరోజు టీ ని తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Tea