Jaya Bachchan: పెళ్లికి ముందే పిల్లల్ని కను.. మనవరాలికు స్టార్ హీరోయిన్ సలహాలు.?
Jaya Bachchan: ఈ మధ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఏ విషయం అయినా డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు.. ముఖ్యంగా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి పిల్లలు అనే ఘట్టం వరుసగా వస్తుంది.. ఈ సాంప్రదాయాన్ని విడమారుస్తూ బాలీవుడ్ లో చాలామంది సినీ నటులు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా పెళ్లి అనే పదానికి వ్యాల్యూ లేకుండా చేస్తున్నారని చెప్పవచ్చు.. అయితే తాజాగా అమితాబ్ బచ్చన్ వైఫ్ జయ బచ్చన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Jaya Bachchan advice for her granddaughter
బాలీవుడ్ లోకి జయ బచ్చన్ మనవరాలు “నవ్య నవేలి నంద” అందరి స్టార్ కిడ్స్ లాగే హీరోయిన్ అవ్వాలని అనుకుంటుందట. ఆమె ఆమె డైరెక్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా, ముందుగా పోడ్ కాస్టు ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని చూస్తోంది. అలా తనకు పేరు వచ్చిన తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు. ‘వాట్ ది హేల్ నవ్య’ అనే ఫోడ్ కాస్ట్ ను ప్రారంభించింది. (Jaya Bachchan)
Alos Read: Sai Pallavi: వివాదంలో సాయి పల్లవి.. కాపీ చేశారంటూ సంచలన కామెంట్స్.?
అయితే ఈ ప్రోగ్రామ్ తన నానమ్మ జయ బచ్చన్ తోనే ప్రారంభించింది.. ఈ సందర్భంగా జయ బచ్చన్ మాట్లాడుతూ ప్రతి మనిషి మధ్య శారీరకంగా అట్రాక్షన్ అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది. మా జనరేషన్ లో మేము ఇలా ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉండేది కాదు.. ఈమధ్య పెళ్లి చేసుకుని చాలామంది ఫిజికల్ రిలేషన్ షిప్ సెట్ కాక విడిపోతున్నారు.. అందుకే పెళ్లికి ముందే ఫిజికల్ రిలేషన్ షిప్ లో మునిగితేలితే ఆ తర్వాత జీవితం హ్యాపీగా ఉంటుందని చెప్పుకొచ్చింది..

నేను ఈ విషయాన్ని మెడికల్ పరంగానే చూస్తాను.. ఈ మధ్యకాలంలో చాలామంది యూత్ లో రొమాన్స్ అనేది తగ్గిపోతోంది.. అందుకే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకొని వారితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్న తర్వాత అన్ని అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవడం మంచిది అంటూ జయబచ్చన్ తెలియజేసింది.. అంటే ఈమె చెప్పిన దాని ప్రకారం పెళ్లికి ముందే తన మనవరాలు కూడా పిల్లల్ని కనవచ్చని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..(Jaya Bachchan)