Vaishnavi Chaithanya: బేబీ నిర్మాతను నమ్మించి మోసం చేసిన వైష్ణవి చైతన్య..నిర్మాత ఫైర్.?
Vaishnavi Chaitanya: 2023 లో వచ్చిన బేబీ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమా చూసి లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయిలు థియేటర్లలోనే కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలను మనం ఎన్నో చూసాం. అలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బేబీ మూవీ ద్వారా అటు ఇద్దరు హీరోలకి ఇటు హీరోయిన్ కి అలాగే నిర్మాత దర్శకుడు కూడా మంచి గుర్తింపు లభించింది.

Vaishnavi Chaitanya who trusted and cheated the producer of Baby
డైరెక్టర్ సాయి రాజేష్ కి అవకాశాలు రావడమే కాకుండా హీరోయిన్ వైష్ణవి చైతన్య కి హీరోగా ఆనంద్ దేవరకొండ కి కూడా అవకాశాలు వస్తున్నాయి.అయితే ఈ సినిమాలో తెలుగు నటి వైష్ణవి చైతన్య హీరోయిన్గా తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. అయితే ఈ సినిమా ద్వారా ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య పై బేబీ నిర్మాత ఎస్కేఎన్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే రీసెంట్గా ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. తెలుగు హీరోయిన్లను అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. (Vaishnavi Chaitanya)
Also Read: Jaya Bachchan: పెళ్లికి ముందే పిల్లల్ని కను.. మనవరాలికు స్టార్ హీరోయిన్ సలహాలు.?
ఎంకరేజ్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది.తెలుగు హీరోయిన్ల కంటే ఇతర ఇండస్ట్రీల నుండి వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేయడం మంచిది అంటూ ఆయన మాట్లాడంతో ఓ పక్క ఆయనపై కొంతమంది తెలుగు వాళ్ళు ఫైర్ అవుతుంటే మరోపక్క వైష్ణవి చైతన్య మోసం చేసింది కావచ్చు. అందుకే అలా చేస్తున్నారని అంటున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేయద్దు అని మాట్లాడడం కొంతమందికి రుచించడం లేదు.

ఇక మరికొంత మందేమో వైష్ణవి చైతన్య బేబీ సినిమా హిట్ కాకముందు నిర్మాతతో అగ్రిమెంట్ చేసుకుందని, ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు తమ సినిమాలోని చేస్తానని అగ్రిమెంట్ చేసి ప్రస్తుతం వేరే సినిమాలో ఆఫర్స్ రావడంతో వేరే సినిమాల్లో చేయడం వల్లే నిర్మాత ఎస్కేన్ అలా పరోక్షంగా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య పై తన అసహనాన్ని బయట పెట్టారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం నిర్మాత ఎస్కేఎన్ అని మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.(Vaishnavi Chaitanya)