Jyothika: మామ మొహం కూడా చూడనని చెప్పిన జ్యోతిక.. భర్త కోసం అలాంటి పని.?


Jyothika: ఈ రోజుల్లో భార్యాభర్తలు కలిసి ఉండాలంటేనే గగనంగా మారుతుంది.. పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత కూడా వారి మధ్య సమస్యలు పుట్టి విడిపోతున్న వారు ఎంతోమంది.. అలాంటి ఈ తరుణంలో ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగైపోయాయని చెప్పవచ్చు.. అలాంటి ఈ తరుణంలో ఆ హీరో కుటుంబం మాత్రం ఉమ్మడి కుటుంబంలో జీవిస్తూ పదిమందికి ఇన్స్పిరేషన్ గా ఉండేది. అలాంటి ఆ కుటుంబంలో వచ్చినటువంటి ఒక చిన్న ఇష్యూ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.

Jyothika who said that she canot even see her uncle face

Jyothika who said that she canot even see her uncle face

దీంతో వారు చెల్లా చెదురై పోయారని చెప్పవచ్చు. ఇంతకీ ఆ కుటుంబం ఏంటయ్యా అంటే హీరో సూర్య కుటుంబం.. తమిళ్ లో స్టార్ హీరోగా వెలుగొందిన సూర్య తండ్రి శివకుమార్ కూడా పెద్ద నటుడే. ఆయన నట వారసులుగా సూర్య జ్యోతిక ఇండస్ట్రీలో మంచి స్టార్లుగా ఎదిగారు.. అలాంటి సూర్య హీరోగా కొనసాగుతున్న సమయం లోనే జ్యోతికతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. అయితే వీరి పెళ్లి తర్వాత కూడా వీరంతా ఉమ్మడి కుటుంబంగానే జీవించారు. హీరో సూర్యకు కార్తీకి ఇద్దరికీ పిల్లలు కూడా పుట్టారు.. (Jyothika)

Also Read: Heroine: 66ఏళ్ల ముసలోడితో హీరోయిన్ రొమాన్స్.. చూస్తే తట్టుకోలేరు.?

ఆనందంగా జీవిస్తున్న ఈ కుటుంబంలో ఒక చిన్న సమస్య చిచ్చు పెట్టింది.. సూర్య తండ్రి శివకుమార్ పెళ్లి తర్వాత జ్యోతికాను సినిమాలో నటించ వద్దని చెప్పారట.. సూర్య మాత్రం ఆమెను నటించమని అన్నారట.
దీంతో ఇద్దరి మధ్య కాస్త విభేదాలు రావడంతో జ్యోతిక మామ మొహం కూడా చూడనని చెప్పి ముంబైకి షిఫ్ట్ అయిపోయిందని మీడియాలో అనేక వార్తలు వినిపించాయి.. కొంతమంది సూర్యతో తండ్రికి గొడవలు వచ్చాయని వార్తలు రాసుకొస్తే మరికొంత మంది కోడలితోనే వచ్చాయని వార్తలు రాసుకుంటూ వచ్చారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు కానీ సూర్య ఫ్యామిలీ మాత్రం ముంబైకి షిఫ్ట్ అయింది నిజం..

Jyothika who said that she canot even see her uncle face

ఇది ఇలా కొనసాగుతున్న తరుణంలో సూర్య మొదలుపెట్టిన పేద పిల్లలకు చదువు చెప్పించే ఫౌండేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ ప్రారంభ కార్యక్రమానికి సూర్య జ్యోతికతో పాటు కార్తీ కుటుంబం, శివకుమార్ కుటుంబం మొత్తం హాజరైంది. ఈ కార్యక్రమంలో అందరూ చాలా హ్యాపీగా గడిపి ఫోటోలకు ఫోజులిచ్చారు.. వీరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని చూస్తే మాత్రం ఆ కుటుంబంలో ఎలాంటి విభేదాలు రాలేదని అర్థమవుతుంది. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఆ కుటుంబంలో చిచ్చు పుట్టించి శివకుమార్ జ్యోతిక మధ్య గొడవ వల్లే వారి విడిపోయారని ఫేక్ వార్తలు క్రియేట్ చేశారు.. అలాంటి ఈ వార్తలకు తాజాగా వారు కలిసి సరదాగా గడిపిన ఫోటోలే నిదర్శనంగా మారడంతో ఆ వార్తలకు చెక్ పడ్డట్టు అయిపోయింది.(Jyothika)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *