Adivi Sesh: నమితతో పెళ్లి.. నన్ను మోసం చేశారు.. అడివి శేష్ షాకింగ్ కామెంట్స్.?
Adivi Sesh: సీనియర్ హీరోయిన్ నమిత అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా పరిచయాలు అక్కర్లేని పేరు.ఈ హీరోయిన్ ఒకప్పుడు తన అందచందాలతో, అభినయంతో కుర్రాళ్ల ను ఒక ఊపు ఊపేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు హిట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమాలో ఈమె నటించిన బికినీ సీన్స్ మాత్రం అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి.

Adivi Sesh shocking comments
అలా నమితకు కోలీవుడ్లో అయితే భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె పై అభిమానంతో గుడి కూడా కట్టించారు. అయితే అలాంటి నమితతో పెళ్లి అని చెప్పి నన్ను మోసం చేశారు అంటూ అడివి శేష్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేశారు. అడివి శేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను సొంతం సినిమాలో చివరలో ఒక పాత్రలో కనిపిస్తాను.(Adivi Sesh)
Also Read: Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ పెళ్లి.. అబ్బాయి కూడా తెలుగువారేనా..హింట్ ఇచ్చిన హీరోయిన్ తల్లి..?
ఇది మీరు గమనించారో లేదో కానీ ఆ సమయంలో డైరెక్టర్ శ్రీనువైట్ల నాకు సెకండ్ హీరో అని చెప్పి తీసుకున్నారు. కానీ చివరికి నా పాత్ర షూటింగ్ కేవలం మూడు రోజుల్లోనే ముగించారు.అయితే అప్పుడే నాకు డౌట్ వచ్చింది కానీ సైలెంట్ అయ్యాను. తీరా సినిమా రిలీజ్ అయ్యాక నా పాత్ర కి ఎంత ప్రియారిటీ ఉందో అర్థమైంది.

అలాగే నాకు సెకండ్ హీరో అని చెప్పి అబద్ధం కూడా చెప్పారు. అందుకే సొంతం సినిమా నేను ఇప్పటివరకు కూడా చూడలేదు అంటూ హీరో సంచలన కామెంట్లు చేశారు.ఇక సొంతం సినిమాలో చివరిగా నమితను పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు పాత్రలో అడివి శేష్ కనిపిస్తారు అలా డైరెక్టర్ చేసిన మోసాన్ని అడివి శేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(Adivi Sesh)