Rajamouli: రాజమౌళి తో ప్రేమలో పడ్డ యాంకర్.. కుచ్ కుచ్ హోతా హై అంటూ..?
Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ దేశాలకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో రుచి చూపిస్తున్నాడు. అలా తను తీసే ప్రతి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నాడు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో సినిమా రాబోతుంది అంటే అది ఏ లెవెల్లో ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి రాజమౌళితో యాంకర్ ప్రేమలో పడింది అంటూ తాజాగా దానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.మరి ఇంతకీ అసలు విషయం ఏంటయ్యా అంటే..

An anchor who fell in love with Rajamouli
రాజమౌళితో యాంకర్ రష్మీ ప్రేమలో పడ్డట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియో ఇప్పటిదైతే కాదు.రాజమౌళి రవితేజతో కలిసి విక్రమార్కుడు సినిమా తెరకెక్కిగంచిన సమయంలోది.ఇక చాలామంది సినిమా ప్రమోషన్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు.ఇందులో భాగంగా విక్రమార్కుడు సినిమా ప్రమోషన్ కోసం రాజమౌళి యువ అనే సీరియల్ లోకి గెస్ట్ గా వెళ్లి తన సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. అయితే ఆ యువ సీరియల్లో మెయిన్ లీడ్ పోషించింది రష్మీ గౌతమ్..(Rajamouli)
Also Read: Jyothika: మామ మొహం కూడా చూడనని చెప్పిన జ్యోతిక.. భర్త కోసం అలాంటి పని.?
రష్మీ ఇప్పుడైతే యాంకర్ గా హీరోయిన్గా బిజీగా ఉంది. కానీ అప్పట్లో అవకాశాలు లేక సీరియల్స్ కూడా చేసింది. అలా యువ సీరియల్లో చేస్తున్న సమయంలోని వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో ఏముందంటే.. రాజమౌళి తో ప్రేమలో పడుతుంది రష్మీ. దాంతో ఇన్ని రోజులు నీతో మాట్లాడేది రాజమౌళి నేనేనా అని మరో యాక్టర్ అడుగుతుంది. దానికి ఊహల్లో తేలిపోతుంది రష్మీ.ఆ తర్వాత వీరిద్దరూ ఒక కాఫీ షాప్ లో కలుసుకుంటారు.అలా రాజమౌళిని చూస్తూ రష్మి సిగ్గు పడిపోతూ మెలికలు తిరుగుతూ ఉంటుంది.దాంతో ఇన్ని రోజులు మీరేనా నాతో మాట్లాడేది అని రష్మీ అడగగా.. రోజులు కాదు అరగంటకు ఒక్కసారైనా నీతో మాట్లాడాల్సిందే అని రాజమౌళి చెబుతూ కుచ్ కుచ్ హోతా హై అని అంటారు.

మరి నేను అంకుల్ అయితే నువ్వేం చేస్తావ్ అని రష్మిని రాజమౌళి అడిగితే నేను ఆంటీని అవుతాను అని చెబుతుంది. అలాగే రష్మీ నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెబుతుంది. దాంతో రాజమౌళి ఇంకెందుకు ఆలస్యం ఆ విషయం చెప్పేయ్ అని అడగగా.. రష్మీ ఒక కొంటె చూపు చూస్తుంది. ఇక చూపుకు అర్థం తెలియని రాజమౌళి ఏంటి కళ్ళు మండుతున్నాయా అని అడగగా..షటప్ దాని అర్థం ఐ లవ్ యు ఇది కూడా తెలియదా అని రష్మి మాట్లాడుతుంది. అయితే అప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ అప్పట్లోనే రష్మీ రాజమౌళికి లైన్ వేసిందా అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.(Rajamouli)