Chhaava Movie: ఛావా మూవీలో రష్మిక చేసిన బిగ్ మిస్టేక్.. ఎవరైనా గమనించారా.?
Chhaava movie: ఎన్నో అంచనాలతో వచ్చిన బాలీవుడ్ ఛావా మూవీ ఆ అంచనాలను బ్రేక్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించిన విక్కీ కౌశల్, రష్మిక మందన్నాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటన వర్ణతాతీతం అని ఎంతో మంది మెచ్చుకుంటున్నారు.అయితే అలాంటి ఈ సినిమాకి రష్మిక పెద్ద మైనస్ అయింది అంటూ సోషల్ మీడియాలో రష్మికపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి.

Rashmika big mistake in Chhaava movie
మరి ఇంతకీ ఎంతో అద్భుతంగా శంభాజీ భార్య యేసు భాయి పాత్రను పోషించిన రష్మిక ఏ విషయంలో పెద్ద మిస్టేక్ చేసింది ఇంతకీ రష్మిక ఛావా మూవీలో చేసిన మిస్టేక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. రష్మిక మందన్నా హీరోయిన్గా చేసిన ఛావా మూవీలో ఆమె యేసు బాయి పాత్ర పోషించింది. అయితే ఈ పాత్రలో రష్మిక చాలా అద్భుతంగా సెట్ అయింది.ముఖ్యంగా కట్టు బొట్టు అన్నీ కూడా ఓ రాజు భార్య ఎలా ఉంటుందో అలాగే రెడీ అయింది.(Chhaava movie)
Also Read: Pawan Kalyan Sacred Bath: వివాదం లో పవన్ కళ్యాణ్ కుంభమేళా పుణ్యస్నానం.. జంధ్యం ధరించడం ఎందుకు?
అయితే అన్ని విషయాల్లో రష్మిక సినిమాకి ప్లస్ అయింది కాని ఒకే ఒక్క విషయంలో మాత్రం రష్మిక బిగ్ మిస్టేక్ చేసిందని,ఈ ఒక్క మిస్టేకే ఛావా మూవీకి పెద్ద తలనొప్పిగా మారింది అంటూ సోషల్ మీడియాలో రష్మికపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మిస్టేక్ ఏంటంటే.. రష్మిక డైలాగ్ డెలివరీ.. ముఖ్యంగా యేసు భాయ్ వంటి పాత్రలో సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్ నటించడం ఏంటి నార్త్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ అయితేనే బాగుంటుంది అని చాలామంది అనుకున్నారు.

కానీ యేసుభాయి పాత్రలో రష్మిక బాగుంది అన్ని బాగున్నప్పటికీ రష్మిక డైలాగ్ డెలివరీ మాత్రం బాగాలేదని, ఒక రాజ వంశీయులకు చెందిన మహిళ మాట్లాడే హిందీని మాట్లాడడానికి రష్మిక ట్రై చేసినప్పటికీ ఆమె డైలాగ్స్ సినిమాకి పెద్ద మైనస్ అయ్యాయని, ఆమె నటన హావభావాలు అన్ని బాగున్నప్పటికీ ఒక డైలాగ్ డెలివరీ మాత్రం ఈ సినిమాకి బిగ్ మిస్టేక్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.(Chhaava movie)