Kamal Haasan: ఆ హీరోను కెరీర్ నాశనం చేసిన కమల్ హాసన్.. కారణం ఆమెనా.?
Kamal Haasan: పాన్ ఇండియా అనే పదం రాకముందే పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది కమల్ హాసన్.. దశావతారం సినిమాలో పది అవతారాల్లో ఏవిధంగా ఆయన నటించారో , సినిమాల్లో కూడా ఎలాంటి క్యారెక్టర్ అయినా అలవోకగా చేసే నటుడు. అలాంటి కమల్ హాసన్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, ఒడిస్సా, హిందీ, ఇలా అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నారు..ఎలాంటి పాత్ర అయినా సరే నటించడమే కాదు దూరిపోతారు.

Kamal Haasan who ruined the career of that hero
అలా కమల్ హాసన్ ఇండస్ట్రీలో ఎదుగుతూ తనను నమ్ముకున్న వాళ్ళని కూడా ఎంతో ఎదిగేలా చేశారు..కానీ ఆ ఒక్క హీరో కెరీర్ ను మాత్రం ఆయన నాశనం చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. దీనికి కారణం ఏంటి వివరాలు చూద్దాం.. కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ అంటే అందరికీ పరిచయమే.. తెలుగు, తమిళ్, హిందీ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పుస్తకాన్ని ఏర్పాటు చేసుకుంది. హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి శృతిహాసన్ ఒక హీరోను పీకల్లోతు లవ్ చేసిందట. (Kamal Haasan)
Also Read: Adivi Sesh: నమితతో పెళ్లి.. నన్ను మోసం చేశారు.. అడివి శేష్ షాకింగ్ కామెంట్స్.?
కానీ ఆ హీరో మాత్రం ఈమెతో లవ్ చేసినట్టు నటించి దారుణంగా మోసం చేశాడట.. అయితే వీరిద్దరి మధ్య లవ్ ఉందని తెలుసుకున్న కమల్ హాసన్ ఆ హీరో గురించి ఎంక్వయిరీ చేయగా ఆయన ఇదివరకే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లను వాడుకొని వదిలేసాడని తెలుసుకున్నారట. కానీ తన కూతురుకు ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోయి ఆ హీరో కెరియర్ ని ఎలాగైనా నాశనం చేయాలనుకున్నాడట..

కానీ ఇంతలోనే ఆ హీరో చేస్తున్న సినిమాలు బ్లాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవ్వడం దర్శక, నిర్మాతలు ఆయనకు ఆఫర్లు ఇవ్వకపోవడం జరిగిపోయాయి.. అంతేకాకుండా తన అసలు క్యారెక్టర్ కూడా శృతిహాసన్ కు తెలియడంతో ఆ హీరోతో బ్రేకప్ చెప్పేసింది.. ఈ విషయం బయటకు రావడంతో కమల్ హాసన్ తనకు ఆఫర్లు రాకుండా చేసి కెరీర్ నాశనం చేశారని నెట్టింటా వార్తలు వచ్చాయి.. కానీ ఇందులో నిజం లేదని ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్లే ఆఫర్లు రాలేదని, కమల్ హాసన్ గురించి తెలిసిన కొంతమంది అంటున్నారు.(Kamal Haasan)