New Import Duties: ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. భారత ఔషధ ఎగుమతులపై అడ్డంకులు!!


New Import Duties on Generic Drugs

New Import Duties: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అమెరికా వాణిజ్య విధానాల్లో భారీ మార్పులు తీసుకువచ్చారు. తన మునుపటి పాలనలో ప్రారంభించిన రక్షణాత్మక వాణిజ్య విధానాలను మరింత కఠినతరం చేశారు. మొదట మెక్సికో, కెనడా, చైనా దిగుమతులపై భారీ సుంకాలు విధించిన ట్రంప్, ఇప్పుడు భారత ఔషధ పరిశ్రమపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా జనరిక్ ఔషధాల (Generic Drugs) దిగుమతులపై కొత్త ట్యాక్స్‌లు విధించేందుకు సిద్ధమవుతున్నారు. భారతదేశం నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో ఔషధ ఎగుమతులు జరుగుతుండటంతో, ఈ నిర్ణయం దేశీయ ఫార్మా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపనుంది.

New Import Duties on Generic Drugs

ప్రస్తుతం అమెరికా భారత ఔషధ పరిశ్రమకు ప్రధాన మార్కెట్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ ఎగుమతుల్లో 31% వాటా అమెరికాకు చెందింది. ప్రధానంగా సన్ ఫార్మా (Sun Pharma), డాక్టర్ రెడ్డీస్ (Dr. Reddy’s), సిప్లా (Cipla), లుపిన్ (Lupin), అరబిందో ఫార్మా (Aurobindo Pharma) లాంటి దిగ్గజ కంపెనీలు అమెరికాకు మందులు సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా భారత ఔషధ దిగుమతులపై సుంకాలు విధిస్తే, అక్కడ ఔషధ ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ప్రభావితమవ్వొచ్చు. అయితే, దీనివల్ల భారతీయ కంపెనీల లాభాలు తగ్గే ప్రమాదం ఉంది.

ఈ మార్పులతో భారత ప్రభుత్వం, ఔషధ పరిశ్రమ వర్గాలు కొత్త వ్యూహాలను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నాయి. అమెరికాలో చిన్న తరహా ఔషధ తయారీ సంస్థలను కొనుగోలు చేయడం లేదా ఇప్పటికే ఉన్న సబ్సిడరీల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం వంటి పరిష్కారాలను పరిశీలిస్తున్నాయి. ఇతర దేశాల్లో ఎగుమతులను పెంచే మార్గాలను కూడా పరిశీలిస్తున్నారు.

ట్రంప్ తాజా నిర్ణయం భారత ఔషధ పరిశ్రమకు పెద్ద సవాల్‌గా మారింది. సుంకా ప్రభావం, ఔషధ ధరల పెరుగుదల, వ్యాపార వ్యూహాల్లో మార్పులు వంటి అంశాలపై పరిశ్రమ వర్గాలు త్వరలో తగిన నిర్ణయాలు తీసుకోనున్నాయి. అయితే, అమెరికా-భారత్ మధ్య ఫార్మా వ్యాపార సంబంధాల భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *