Akula Soniya: బిగ్ బాస్ 8 ద్వారా ఒక్కసారిగా సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది ఆకుల సోనియా.. బిగ్ బాస్ హౌస్ లో సీరియల్ హీరో నిఖిల్ తో ఆకుల సోనియా నడిపించిన ప్రేమాయణం అంతా ఇంతా కాదు. వీరిద్దరికి సంబంధించిన లవ్ సాంగ్స్,ఎమోషనల్ బాండింగ్ మొత్తం బిగ్ బాస్ చాలా రొమాంటిక్ గా చూపించారు. కానీ మా మధ్య ఏమీ లేదు కేవలం అన్నాచెల్లెళ్ల బంధం, ఫ్రెండ్షిప్ అంటూ చెప్పింది.కానీ బిగ్బాస్ మాత్రం వీరిద్దరిని ప్రేమికుల లాగే చిత్రీకరించారు.
Bigg Boss beauty Akula Soniya who is getting married for money
అయితే హౌస్ నుండి బయటకు వచ్చాక ఈ ముద్దుగుమ్మ తనని అలా చెడుగా చూపించడం పై ఫైర్ అయ్యింది. ఈ విషయం పక్కన పెడితే బిగ్బాస్ సోనియా పెళ్లయి ఓ కొడుకు ఉన్న వ్యక్తిని పెళ్లాడబోతుందట. అవును మీరు వినేది నిజమే.బిగ్ బాస్ సోనియా కి పెళ్లి ఫిక్స్ అయిందని తన తల్లిదండ్రులు ఆమె హౌస్ లో ఉన్న సమయంలోనే బయటపెట్టారు. (Akula Soniya)
Also Read: Oviya: బిగ్ బాస్ బ్యూటీ ఓవియా కి బంపర్ ఆఫర్.. మాములు ఛాన్స్ పట్టలేదుగా!!
అయితే సోనియా పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు యష్.కానీ ఆయనకు అప్పటికే పెళ్ళై విడాకులు అయ్యాయి. ఇక మొదటి భార్యతో యష్ కి ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు కూడా ప్రస్తుతం యష్ దగ్గరే ఉంటున్నారట. అయితే అలాంటి వ్యక్తిని సోనియా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది.ఒక రకంగా యష్ కి సోనియా రెండో భార్యగా వెళ్లబోతుంది.
ఈ విషయాన్ని స్వయంగా సోనియా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టింది.ఇక ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది సోనియా పై నెగిటివ్ గా మాట్లాడుతున్నారు.సోనియా కేవలం డబ్బు కోసమే రెండో పెళ్లి వాడిని చేసుకుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Akula Soniya)