Chiranjeevi: లైవ్ లోనే కొట్టుకున్న చిరు రాజశేఖర్.. భయపడేది లేదన్న చిరు.!
Chiranjeevi: తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు చిరంజీవి, రాజశేఖర్, మోహన్ బాబు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, ఊపు ఊపారు.. ఇందులో ప్రస్తుతం రాజశేఖర్ మోహన్ బాబు సినిమాల్లో ఇనాక్టివ్ గా ఉన్నారు కానీ మిగతా హీరోలంతా కుర్ర హీరోలతో పోటీగా దూసుకుపోతున్నారు.. అయితే వీరంతా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో చిరంజీవి రాజశేఖర్ కి మధ్య అసలు పడేది కాదట.. ఇద్దరు ఎదురెదురుగా వస్తే తప్పకుండా ఏదో ఒక గొడవ జరిగేదట..

Chiranjeevi Rajasekhar who was beaten in live
వీరిద్దరూ గొడవ మితిమీరిపోయి ఒక ఈవెంట్ లైవ్ గానే గొడవకు దిగారు.. మరి ఆ విషయం ఏంటో చూద్దామా.. హీరో రాజశేఖర్ ఒక పెద్ద డాక్టర్. కానీ సినిమాలపై ప్రేమతో ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు పొందారు. ఆయన చేసిన చాలా సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు.. కానీ నిర్మాణరంగంలో అడుగుపెట్టి తీవ్రంగా లాస్ అయ్యారు.. అలాంటి రాజశేఖర్ ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడుతారు. (Chiranjeevi)
Also Read: Krishna Vamsi: ఆర్జీవితో కృష్ణవంశీకి గొడవలు.. మొహం కూడా చూడడం లేదా.?
అయితే ఒక ఈవెంట్ కు రాజశేఖర్, చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారట. ఈ ఈవెంట్ కు మీడియా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు.. అయితే ఇదే సమయంలో అనూహ్యంగా రాజశేఖర్ ఈవెంట్ మధ్యలో నుంచే లేచి వెళ్లిపోయారట. అప్పుడు మెగాస్టార్ మైక్ తీసుకొని మాట్లాడుతూ ఇష్టంలేని ప్రోగ్రామ్స్ కు ముందుగానే రానని చెప్పాలి. వచ్చి గొడవ చేసి వెళ్లిపోవడం మంచిది కాదని అన్నారు..

అలా వెళ్ళిపోతున్న రాజశేఖర్ మళ్ళీ వెనక్కి వస్తూ నాకు ఒక ఈవెంట్ అని చెప్పి మరో దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ నేను అనుకున్న విధంగా లేదు, ఇలా అబద్ధాల మధ్య నేను ఉండలేను అంటూ చిరంజీవిపై ఫైర్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో చిరంజీవి ఏదైనా సరే పర్ఫెక్ట్ గా మాట్లాడాలి, ఏదైనా సంఘం ఉంటే మాత్రం ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేశారు.ఈ విధంగా లైవ్ లోనే చిరంజీవి, రాజశేఖర్ మధ్య కాస్త వార్ జరిగింది. ఇది అప్పట్లో పెద్ద సెన్సేషనల్ వార్తగా మారింది. ప్రస్తుతం ఈ మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Chiranjeevi)