Asin: ప్రేమించానని నమ్మించి కోట్లు నొక్కేసింది.. అసిన్ నిజ స్వరూపం బయటపెట్టిన హీరో.?
Asin: హీరోయిన్ అసిన్ అంటే తెలియని ఇండియన్ సినీ ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఈమె సౌత్ ఇండస్ట్రీ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది.అలా ఎన్నో సినిమాలతో జోరు మీదున్న ఈ ముద్దుగుమ్మ చివరికి 2016లో బిజినెస్ మాన్ రాహుల్ శర్మని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. అయితే అలాంటి అసిన్ నిజ స్వరూపం బయట పెట్టారు ఓ నటుడు.నా దగ్గర డబ్బులు నొక్కేసి ప్రేమిస్తున్నానని నన్ను మోసం చేసింది అంటూ సంచలన కామెంట్లు చేశాడు.మరి ఇంతకీ అసిన్ ఏ హీరోని మోసం చేసిందో ఇప్పుడు చూద్దాం..

Asin true nature is revealed by the hero
ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించిన చాలామందికి పెళ్లికి ముందు ఎన్నో ఎఫైర్లు ఉన్నట్టు వార్తలు వినిపించడం సహజమే. అలా హీరోయిన్ అసిన్ కూడా గతంలో సినిమాల్లో చేసిన సమయంలో నితిన్ ముఖేష్ తో డేటింగ్ చేసింది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ చాలా రోజులు కొనసాగడంతో నితిన్ అసిన్ ని నమ్మి ఆమె అవసరం కోసం డబ్బులు కూడా ఎక్కువగానే ఇచ్చారట. అయితే తనకు మాత్రమే సొంతం అనుకున్న అసిన్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి హీరోలతో నటించిన సమయంలో వారితో క్లోజ్ గా ఉండడం సహహించలేని నితిన్ ఓ ప్రెస్ మీట్ పెట్టి అసిన్ పెద్ద మోసగత్తే.(Asin)
Also Read: Chhaava Movie: ఛావా మూవీలో రష్మిక చేసిన బిగ్ మిస్టేక్.. ఎవరైనా గమనించారా.?
ఆమె నన్ను చాలా చీట్ చేసింది.నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి చివరికి నా దగ్గర డబ్బులు దొబ్బేసి నన్ను మోసం చేసి ప్రస్తుతం నాకు అందనంత ఎత్తుకి వెళ్ళిపోయింది అంటూ మాట్లాడడంతో అసిన్ కి సంబంధించి ఈ వివాదం బీటౌన్ లో వైరల్ అయింది.అయితే ఈ వివాదం జరిగాక అసిన్ కి ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ సల్మాన్ ఖాన్ వంటి పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ గురించి అసిన్ మాట్లాడుతూ నాకు సల్మాన్ కేవలం ఫ్రెండ్ మాత్రమే.

నాకు ఆయన ఎలాంటి సహాయం చేయలేదు. నా టాలెంట్ తోనే అవకాశాలు వస్తున్నాయి. అన్నట్లుగా మాట్లాడటంతో సల్మాన్ కూడా అసిన్ ని దూరం పెట్టేసారట.దాంతో సినిమాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అసిన్ మాత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్గా స్టార్ స్టేటస్ అయితే సంపాదించుకుంది.అలా హీరోయిన్ గా గుర్తింపు వచ్చాక చివరికి బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అసిన్ తన భర్తకు సంబంధించి పలు బిజినెస్ లు చూసుకుంటుంది. అలాగే వీరికి దాదాపు 1500 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు సమాచారం.(Asin)