Babu Mohan: సిల్క్ స్మితకి పొగరు.. దుబాయ్ తీసుకెళ్లి అలాంటి పని చేసింది.?
Babu Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ కామెడీ నటుడు ఎవరయ్యా చాలామందికి గుర్తుకు వచ్చేది ప్రస్తుతం బ్రహ్మానందం మాత్రమే.. అయితే బ్రహ్మానందంతో సమానంగా నటించి సినిమాల నుంచి పక్కకు తప్పుకున్న కామెడీ నటుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాబు మోహన్..అలాంటి ఆయన కామెడీలోనే వైవిద్యమైనటువంటి కామెడీ సృష్టించడంలో దిట్ట. అలాంటి బాబు మోహన్ ఇండస్ట్రీలో ఉండేటువంటి చాలామంది హీరోయిన్స్ తో పని చేశారు..

Babu Mohan Shocking comments on Silk Smita
ఈయన సిల్క్ స్మితతో కూడా చాలా చిత్రాల్లో వర్క్ చేశారు.. ముఖ్యంగా సిల్క్ స్మితాను దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో బాబు మోహన్ కూడా ఒకరు.. బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సిల్క్ స్మిత చాలా నిక్కచ్చి మనిషి అని, ఆమె ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడే తత్వం ఉండేదని చెప్పుకొచ్చారు.. ఇక షూటింగ్ సెట్స్ లో అయితే సిల్క్ స్మిత ఎక్కువగా బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకొని కాలుపై కాలు వేసుకొని కూర్చునేదని, ఆమె ఎంత పెద్ద దర్శక నిర్మాతలు అయినా కేర్ చేసేది కాదని తన పని తాను చేసుకుంటూ తనకు నచ్చినట్టు ఉండేదని చెప్పుకొచ్చారు..(Babu Mohan)
Also Read: Soundarya: సౌందర్య మరణంపై ఊహించని నిజం.. వాళ్లకి ముందే తెలిసిన చెప్పలేదా.?
కొన్ని సందర్భాల్లో హీరోలు వస్తే కూడా కాలుపై కాలు వేసుకొని ఉంటావా, కాలు కిందికి దించొచ్చు కదా అని అడిగితే.. నేను హీరోలు వస్తే ఎందుకు కాలు తీయాలి అంటూ ముక్కు సూటిగానే జవాబు ఇచ్చేదని బాబు మోహన్ అన్నారు.. అయితే మేమంతా ఒకసారి దుబాయ్ షూటింగ్ కోసం వెళ్ళాం.. షూటింగ్ కంప్లీట్ అయ్యాక షాపింగ్ కోసం నన్ను తీసుకొని వెళ్ళింది సిల్క్ స్మిత.. అక్కడ బ్లాక్ కలర్ గ్లాసెస్ కొన్నది.. ఇవి ఎలా ఉన్నాయని అడిగింది చాలా బాగున్నాయి మేడం అని చెప్పడంతో ఇవి నీకోసమే అని నాకు పెట్టేసింది..

అలా సిల్క్ స్మిత ఏ విషయాన్నైనా డైరెక్ట్ గా మొహం ముందే మాట్లాడేది.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమైతే అస్సలు కాదని చెప్పుకొచ్చారు.. ఆమెను తట్టుకోలేక కొంతమంది వ్యక్తులు వివాదాల సృష్టించి ఆమెపై లేనిపోని అబద్ధాలు వేసి చివరికి మరణించేలా చేశారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాబు మోహన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Babu Mohan)