Mushroom: శాఖాహారము ఇష్టంగా తినే వాటిలో మష్రూమ్స్ ఒకటి. వీటిని పుట్టగొడుగులు అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా శాఖాహారులు తినే మాంసాహారం అని కూడా పిలుస్తారు. ఇందులో మాంసాహారంలో లభించే ప్రోటీన్లన్ని ఉంటాయి. ఇది చాలా మంచి ఆహారం. చాలా సంవత్సరాలుగా మష్రూమ్స్ ఆహారంలోనూ, ఎన్నో రకాల ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. అంతేకాదు వీటిని ప్రతిరోజు డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. Mushroom

Health Benfits With Mushroom

పుట్టగొడుగుల్లో విటమిన్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో మ్యూనిటీ పవర్ పెంచుతాయి. క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా కాపాడుతాయి. ఇది పోషకమైన రుచికరమైన ఆహారం. వీటిని శాకాహారులు చాలా ఇష్టంగా తింటారు. ప్రతిరోజు పుట్టగొడుగులు ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు బాగుంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. Mushroom

Also Read: Babar Azam: 5 రకాల జంతువులను తింటున్న బాబర్ ?

జ్ఞాపకశక్తి, బలహీనత వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది నరాల ఉత్పత్తిని రక్షించడానికి సహాయపడతాయి. మొద్దు బారిన మెదడు, వయస్సు సంబంధిత మానసిక రుగ్మతలు, ఆల్జీమర్స్ వ్యాధి నుంచి కాపాడుతాయి. ఇందులో ఉండే లినోలిక్ యాసిడ్, యాంటీ కార్సినోజెనిక్ కాంపౌండ్ గా సహాయపడుతుంది. శరీరంలో ఉండే అధిక ఈస్ట్రోజన్ స్థాయిలు, హానికరమైన ప్రభావాలను తొలగిస్తాయి. రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యల నుంచి కాపాడతాయి. అందుకే ప్రతి ఒక్కరు మష్రూమ్స్ తినాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Mushroom