Nutmeg: జాజికాయని ఇలా తీసుకుంటే..రాత్రంతా పండగే ?
Nutmeg: జాజికాయ చిన్న సైజు ఆపిల్ లా ఉండే జాజిఫలంలోనే గట్టి విత్తనం. జాజికాయ మట్టి రుచితో కూడిన ఘాటైన తీపి వాసనతో ఉంటుంది. సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనదిగా భావించే జాజికాయ చాలామంది వంటకాలను ఉపయోగిస్తూ ఉంటారు. రకరకాల డెసర్ట్ లు, కారంగా ఉండే ఆహార పదార్థాల రుచిని పెంచడంలో జాజికాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో పీపీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, బీ కాంప్లెక్స్, విటమిన్ సి వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

Nutmeg Benefits that Make it a Wellness Wonder
పసుపు పాలు గురించి చాలామంది వినే ఉంటారు. కానీ ప్రతిరోజు పాలలో చిటికెడు జాజికాయ పొడి కలిపి తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి. రాత్రి పడుకునే సమయంలో పాలలో చిటికెడు జాజికాయ పొడిని కలిపి తాగినట్లయితే బాగా నిద్ర పడుతుంది. ఎందుకంటే ఇది ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జాజికాయ వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి జాజికాయ పొడిని గోరువెచ్చని పాలలో కలిపి తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి రిలీఫ్ పొందుతారు. జాజికాయ చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. పాలతో జాజికాయ పొడి కలిపి తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.
Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ?
జాజికాయ పొడి కలిపిన పాలు తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. కానీ అధిక బరువుతో ఉన్నవారు ఈ పాలు తాగకూడదు. పాలలో చిటికెడు జాజికాయ పొడి కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఎముకలు, కండరాలకు ఎంతగానో బలాన్ని ఇస్తుంది. కీళ్ల నొప్పులను తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని రకాల లాభాలు ఉన్న జాజికాయలను మితంగా మాత్రమే తీసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.