Gummadi Narasayya: రేవంత్ రెడ్డి డ్రాయరే విప్పుతారు ?
Gummadi Narasayya: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తొందరలోనే రేవంత్ రెడ్డి డ్రాయర్ విప్పుతారని… హాట్ కామెంట్స్ చేశారు గుమ్మడి నరసయ్య. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుమ్మడి నరసయ్య… రేవంత్ రెడ్డి తిట్లపైన స్పందించారు.

Gummadi Narasayya Slams Cm revanth reddy
గులాబీ పార్టీ నేతల డ్రాయర్లు వీపుతానని… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు అక్కడ ఉన్న యాంకర్. అయితే దీనిపై వెంటనే గుమ్మడి నరసయ్య స్పందించారు. గులాబీ నేతల డ్రాయర్లు కాదు ఆయన డ్రాయర్ లాగేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తున్నారని బాంబు పేల్చారు. తనని ఎర్రటి ఎండలో నిల్చోపెట్టాడని కూడా ఫైర్ అయ్యారు.
Chahal, Dhanashree Divorce: రూ.60 కోట్లు నొక్కేసిన చాహల్ భార్య ?
ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యే అయిన తనకు అపాయింట్మెంట్… ఇవ్వకుండా బయట నిలబెట్టాడని మండిపడ్డారు గుమ్మడి నరసయ్య. తన సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే కచ్చితంగా ఏ సీఎం అయినా స్పందిస్తారని వెల్లడించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం దౌర్జన్యంగా వ్యవహరించాడని ఆగ్రహించారు. దీంతో గుమ్మడి నరసయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.