Keerthy Suresh: అన్నీ బాగుంటే కీర్తి సురేష్ ఆ స్టార్ హీరో కి భార్య అయ్యేది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.?
Keerthy Suresh: సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగడం అంటే కత్తి మీద సాము లాంటిదే.. ముఖ్యంగా కొంతమంది సినీ బ్యాగ్రౌండ్ తో వస్తారు అయినా వారికి స్టార్డం అనేది అస్సలు రాదు. కానీ కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి చిన్న చిన్న సినిమాలతో అడుగు పెడతారు. ఆ చిత్రాలే వారికి ఓవర్ నైట్ లో స్టార్లను చేసి పెడతాయి. అలా ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ ఆమె స్టార్ గా ఎదగడానికి చాలా సమయం పట్టింది. ఆమె చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో దర్శక, నిర్మాతలు ఆఫర్లు ఇవ్వకుండా ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేశారు..

Director shocking comments on Keerthy Suresh Wedding
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే మహానటి కీర్తి సురేష్.. ఎందరు ఎన్ని మాటలు అన్నా కానీ వాటిని పట్టించుకోకుండా తనకు ఒక సక్సెస్ రాకపోతుందా అని ఎదురు చూసి చివరికి ‘మహానటి’ సినిమాలో నటించి తన నటనకు ఎదురులేదని పించుకుంది. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో కీర్తి సురేష్ పేరు ఆకాశానికి ఎక్కింది.. ఇక అప్పటినుంచి ఆమెకు వరుస అవకాశాలు వస్తూ చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, బాలీవుడ్ చిత్రాల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకుంది. అలాంటి కీర్తి సురేష్ ను ఆ హీరోతో పెళ్లి చేయాలని డైరెక్టర్ లింగుస్వామి భావించారట. (Keerthy Suresh)
Also Read: Priyanka Chopra: ఒక్క రాత్రిలో పోతుంది.. వర్జి**టీ పై ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్స్..?
అంతేకాదు ఆయన కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి ఆ హీరోని పెళ్లి చేసుకుంటావా ఆయనపై మీ అభిప్రాయం ఏంటని కూడా డైరెక్ట్ గా అడిగారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్. ఈయన 25వ సినిమా పందెంకోడి 2… 2018 లో వచ్చిన ఈ చిత్రంలో విశాల్ సరసాన కీర్తి సురేష్ నటించింది.. అయితే సినిమాల్లో వీరి కాంబినేషన్ అద్భుతంగా సెట్ కావడమే కాకుండా, బయట కూడా అద్భుతంగా కనిపించడంతో విశాల్ తండ్రి కీర్తి సురేష్ ను విశాల్ కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని భావించారట.

వెంటనే ఈ విషయాన్ని డైరెక్టర్ లింగు స్వామికి చెప్పడంతో, ఆయన ఓ రోజు కీర్తి సురేష్ ను సీక్రెట్ గా పిలిచి విశాల్ పైన అభిప్రాయం ఏంటని అడిగారట.. కీర్తి సురేష్ నాకు అలాంటిది ఏమీ లేదు. నాకు చిన్నప్పటి నుంచే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన్ని నేను పెళ్లి చేసుకుంటానని డైరెక్టుగా చెప్పేసిందిట.. ఆ విధంగా కీర్తి సురేష్ బిజినెస్ మాన్ అయినటువంటి ఆంటోనీ థట్టిల్ ను 2024లో వివాహం చేసుకొని ఓ ఇంటిదయ్యింది.. పెళ్లికి లింగుస్వామి కూడా హాజరయ్యారు.. పెళ్లి సందర్భంలోనే ఆయన ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..(Keerthy Suresh)