Tarun: తరుణ్ ప్రియమణిల పెళ్లి చెడగొట్టిన లేడీ.. ఎవరంటే.?
Tarun: తరుణ్ ప్రియమణిల పెళ్లి…అప్పట్లో ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించిన వార్త.. తరుణ్ ప్రియమణి హీరో హీరోయిన్గా నవవసంతం సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా షూట్ సమయంలో తరుణ్ ప్రియమణిలు ప్రేమలో పడ్డారని,వీరి పెళ్లికి తరుణ్ తల్లి రోజా రమణి ఓకే చెప్పినట్టు గాసిప్స్ లో వినిపించాయి. అయితే ఈ రూమర్లలో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ రూమర్లు వినిపించిన వెంటనే మరో రూమర్ కూడా వినిపించింది.

Who is the lady who ruined the wedding of Tarun Priyamani
అదేంటంటే..తరుణ్ ప్రియమణిని కేవలం ఫ్రెండ్ గానే చూసారని, కానీ ఆర్తి అగర్వాల్ ని మాత్రం గాఢంగా ప్రేమించారని,అయితే ఆర్తి అగర్వాల్ తన ఇంటికి కోడలుగా రావడం ఇష్టం లేని రోజా రమణి తన ఇంటికి కోడలుగా ఆర్తి అగర్వాల్ అసలే వద్దు..నాకు ఆమె క్యారెక్టర్ నచ్చలేదు. పెళ్లి చేసుకుంటే వేరే అమ్మాయిని చేసుకో కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం వద్దు అని తెగేసి చెప్పిందట. అంతేకాదు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా కొడుకువే కావు అని పెద్ద పెద్ద డైలాగులు వేయడంతో తరుణ్ ఆర్తి అగర్వాల్ ని దూరం చేసుకున్నారట.(Tarun)
కానీ ఆ తర్వాత తరుణ్ ప్రియమణి మధ్య రూమర్లు వినిపించడంతో ఇది నిజం అవ్వాలి అని రోజా రమణి ఇద్దరి పెళ్లి చేసి ప్రియమణిని తన ఇంటి కోడలు చేసుకోవాలని ఆశపడిందట.కానీ మధ్యలో ఆర్తి అగర్వాల్ కలగజేసుకోవడంతో వీరి పెళ్లి ఆగిపోయింది అంటూ అప్పట్లో కొన్ని వార్తలు టాలీవుడ్ మీడియాని కుదిపేసాయి. అయితే వీరి పెళ్లి వార్తలపై ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలపై అయితే చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది ప్రియమణి..

అప్పట్లో తరుణ్ ప్రియమణిల పెళ్లి అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రియమణి కోపంగా అసలు ఈ చెత్త వార్తలు క్రియేట్ చేసింది ఎవడో కానీ వాడికి నా చేతిలో మూడింది అన్నట్లుగా స్పందించింది.అంతే కాదు ఇంకొకసారి ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తే మాత్రం రియాక్షన్ మరోలా ఉంటుందని, ఇలాంటి వార్తలు క్రియేట్ చేసేవారిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను అంటూ గట్టిగా స్పందించింది.అయితే ఇదే విషయంపై రీసెంట్గా ఓ షోలో కూడా క్లారిటీ ఇచ్చింది. నాతో పెళ్లికి తరుణ్ తన తల్లిని ఒప్పించాడని, తరుణ్ నాకు గిఫ్ట్ గా ఇచ్చారని వార్తలు రాశారు కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ప్రియమణి చెప్పుకొచ్చింది.(Tarun)