Chiranjeevi: బాలకృష్ణనే కాదు చిరంజీవి కూడా ఆ చండాలమైన పని చేశారు.. నిర్మాత సంచలనం.?
Chiranjeevi: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికి ఆరుపదుల వయస్సు దాటినా కానీ సినిమాల్లో హిట్లమీద హిట్లు అందుకుంటున్న హీరో ఎవరయ్యా అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది బాలకృష్ణ మాత్రమే.. ఆయన ఏజ్ హీరోలతో పోలిస్తే బాలకృష్ణకు మాత్రమే సూపర్ సక్సెస్ రేట్ ఉందని చెప్పవచ్చు. అలాంటి బాలయ్య ఏది చేసినా ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు.. ఆయన తొడకొడితే సుమోలన్నీ గాల్లో లేవడం, ఒంటి చేత్తో ట్రైన్ ఆపడం ఈయనతోనే సాధ్యం..ఈ విధంగా సినిమాల్లో వెరైటీ మసాలా చూపించడంలో బాలకృష్ణ దిట్ట..

Not only Balakrishna but also Chiranjeevi did that work
ఇలాంటి బాలయ్య ఒక దరిద్రపు పని చేశాడని డైరెక్టర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. మరి ఆయన చేసిన ఆ పని ఏంటి వివరాలు చూద్దాం.. బాలకృష్ణ అఖండ చిత్రం ఎప్పుడైతే చేశారో ఆ సినిమా నుంచి ఆయనకు సూపర్ హిట్లే పడుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన డాకు మహారాజు వరకు ఆయన రేంజ్ ఆపకుండా సాగుతోంది. ఇదే కాకుండా రాజకీయాల్లో కూడా మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించాడు.. అంతేకాదు ఆయన టాలెంట్ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది. (Chiranjeevi)
Also Read: Chiranjeevi Dance: బహుముఖ ప్రజ్ఞాశాలి చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన ఏకైక పాట ఎదో తెలుసా?
అన్ని రంగాల్లో మంచి గుర్తింపుతో దూసుకుపోతున్న బాలకృష్ణ ఆ సినిమాలో ఒక చిన్న తప్పు చేశారని తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్వ్యూలో చెప్పారు.. ఆయన చేసిన తప్పు ఏంటయ్యా అంటే..డాక్ మహారాజ్ చిత్రంలో దబిడ దిబిడే అనే సాంగ్ సూపర్ హిట్ అయింది. సాంగ్ లో ఊర్వశి రౌటేలాతో ఆయన చాలా సెక్సీ మూమెంట్లు చేశారు.. ఈ సమయంలో ఆయన చేసినటువంటి కొన్ని స్టెప్స్ వివాదానికి గురయ్యాయి.. మీరు ఉన్నటువంటి రేంజ్ కు అలాంటి పాట చేయడం అవసరమా అంటూ కొంతమంది నెటిజన్స్ ఏకిపారేశారు..

దీనిపై తమ్మారెడ్డి కూడా రియాక్ట్ అవుతూ సినిమా ఎలాగైనా హీట్ అవుతుంది.. అందులో అలాంటి పాట పెట్టకుంటే బాగుండు కదా ఆ పాట పెట్టడం వల్ల కాస్త విమర్శలు వచ్చాయి అంటూ చెప్పుకోచ్చారు.. అంతేకాదు చిరంజీవి కూడా ఖైదీ నెంబర్ 150 సినిమాలో కాజల్ తో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే సాంగ్ కాజల్ తో చాలా బోల్డ్ గా డాన్స్ చేశారని, అది నాకు అసలు నచ్చలేదని, ఆయన ఉన్న రేంజ్ లో అలాంటి పాట చేయడం దరిద్రపు పని అంటూ విమర్శించారు.. ప్రస్తుతం ఆయన ఇద్దరు హీరోలను డైరెక్ట్ గా దరిద్రపు పని చేశారని విమర్శించడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.(Chiranjeevi)