YS Jagan: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. వైఎస్ జగన్ వాకౌట్.. వేడెక్కిన రాజకీయం!!


YS Jagan Walks Out of AP Assembly

YS Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వారు సభలో నిరసన తెలిపారు.

YS Jagan Walks Out of AP Assembly

గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో వైఎస్ జగన్ మరియు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభను వీడిపోయారు. రాజకీయ ఉద్రిక్తతల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష హోదాను గుర్తించాని మరియు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని చిన్నచూపు చూడకూడదని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ఈ సమావేశాల్లో స్పీకర్ కీలక ఆదేశాలు వెలువరించనున్నారు. రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ, బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు మరియు ప్రతిపక్ష వ్యూహాలు హాట్ టాపిక్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *