Tarun Adarsh Praises Pushpa2: పుష్ప మూవీ బాలీవూడ్ రివ్యూ..పూనకాలు ఖాయం!!
Tarun Adarsh Praises Pushpa2: తెలుగు సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా నిన్న ప్రీమియర్స్ ద్వారా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకే హైలైట్ గా నిలిచాయి. విడుదలయిన మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో, బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ రివ్యూ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Tarun Adarsh Praises Pushpa2
తరణ్ ఆదర్శ్ ఈ చిత్రాన్ని “మెగా-బ్లాక్‌బస్టర్” అంటూ అభివర్ణించారు. సినిమా లోని ప్రతి అంశం అద్భుతంగా ఉందని, ముఖ్యంగా అల్లు అర్జున్ నటన బాగుందని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. “అల్లు అర్జున్ తన ప్రతిభతో సినిమాను మరో మెట్టుపైకి తీసుకెళ్లాడు, అన్ని అవార్డులకు అర్హుడయ్యాడు” అంటూ కొనియాడారు. దర్శకుడు సుకుమార్ తన టేకింగ్, కథనంతో బాక్సాఫీస్‌ని షేక్ చేసేలా సినిమా తీశారని అన్నారు. యాక్షన్ సీక్వెన్సులు, ఫైట్స్ కొరియోగ్రఫీ, డైలాగులు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని అభిప్రాయపడ్డారు.
Also Read: Hyderabad Lakes Protection Initiative: మరో కీలక నిర్ణయం తీసుకున్న హైడ్రా.. 2025 జనవరి నుంచి!!
సినిమాలో ‘డైలాగ్స్’ అంత్యంత పవర్ ఫుల్ గా ఉండడం తొలిభాగానికి సమానంగా ఉందని తరణ్ ఆదర్శ్ వివరించారు. రన్‌టైమ్ గురించి ప్రస్తావిస్తూ, నవీన్ నూలీ ఎడిటింగ్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తాయని చెప్పారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కథలో ముఖ్యమైన పాత్ర పోషించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుందని పేర్కొన్నారు.
తరణ్ ఆదర్శ్ రివ్యూలో అల్లు అర్జున్ దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగా అభివర్ణించడం గమనార్హం. ఆయన పాత్రకు జీవం పోసి డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మైమరపింపచేశారని అన్నారు. ఫహద్ ఫాసిల్ తన విలన్ పాత్రలో శక్తివంతమైన నటన కనబరిచారని, రష్మిక మందన్న తన పాత్రలో చక్కగా మెరిశారని కొనియాడారు. ‘పుష్ప 2: ది రూల్’ తప్పకుండా చూడాల్సిన సినిమా అని వ్యాఖ్యానిస్తూ, ఈ రివ్యూ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని మరింతగా పెంచింది.