NTR Movie: అప్పుడు బాబాయ్ తో.. ఇప్పుడు అబ్బాయ్ తో.. ఇరగదీస్తున్న బ్యూటీ!!

NTR Movie: నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆమె చేసిన “దబిడి దిబిడి” పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పాటపై కొందరు విమర్శలు చేసినప్పటికీ, ఇది జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయంగా కూడా ట్రెండ్ అయ్యింది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటలలో ఇది ఒకటిగా నిలిచింది.
Urvashi Rautela Role in NTR Movie
ఈ సినిమా తర్వాత ఊర్వశి రౌతేలాకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యారని టాలీవుడ్ వర్గాల సమాచారం. తాజా బజ్ ప్రకారం, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్టులో ఊర్వశి రౌతేలా కూడా భాగం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఊర్వశి కీలక పాత్రలో కనిపించడంతో పాటు ఒక ప్రత్యేక పాటలోనూ అలరించనుంది.
డాకు మహారాజ్ లో బాలయ్యతో దబిడి దిబిడి అంటూ హిట్ కొట్టిన ఊర్వశి, ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఎలాంటి పాటలో కనిపిస్తుందో ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా, దీనికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఎన్టీఆర్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభంకానుంది. 2026 జనవరి 9న ఈ గ్రాండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఊర్వశి రౌతేలా పాత్రపై త్వరలోనే స్పష్టత రానుంది.