Sundeep Kishan: ఆ హీరోయిన్ దగ్గర సీక్రెట్ గా 5 లక్షలు అప్పు చేసిన సందీప్ కిషన్.?
Sundeep Kishan: ఏంటి సందీప్ కిషన్ అంత పెద్ద హీరో అయి ఉండి ఓ రెస్టారెంట్ ని రన్ చేస్తూ వేరే హీరోయిన్ దగ్గర 5 లక్షల అప్పు చేశారా.. ఇండస్ట్రీకి వచ్చాక చేసారా లేక ఇండస్ట్రీకి రాకముందు ఆ అప్పు చేశారా..ఇంతకీ సందీప్ కిషన్ ఏ హీరోయిన్ దగ్గర అప్పు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సందీప్ కిషన్.అలా నటుడుగా తనకంటూ గుర్తింపు సంపాదించిన సందీప్ కిషన్ పలు సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో రాణిస్తున్నారు.

Sundeep Kishan who secretly loaned 5 lakhs to that heroine
మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు. అయితే అలాంటి సందీప్ కిషన్ హీరోగా చేసిన తాజా మూవీ మజాకా.. మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్.ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ తాను ఓ హీరోయిన్ నుండి 5 లక్షల అప్పు చేశానని ఓ సీక్రెట్ బయట పెట్టారు. ఇక సందీప్ కిషన్ 5 లక్షలు అప్పు చేసింది ఏ హీరోయిన్ దగ్గరో కాదు రెజీనా కసాండ్రా.. చాలా రోజుల నుండి రెజీనా సందీప్ కిషన్ మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. (Sundeep Kishan)
Also Read: Sudeep: ఆ హీరోయిన్ మోజులో పడి భార్యకు అన్యాయం చేసిన సుదీప్.?
అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించిన సందీప్ కిషన్ మా ఇద్దరి మధ్య మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు.ఆమె నాకు ఎప్పటికీ ఫ్రెండ్..మేమిద్దరం కలిసేది అమావాస్య పౌర్ణమికి అలా కలుస్తాం. కనీసం ఫోన్ కూడా మాట్లాడుకోము. కానీ కలిసినప్పుడు మాత్రం చాలా కొట్టుకుంటాం.ఇద్దరం టామ్ అండ్ జెర్రీ లాగే ప్రవర్తిస్తాం.అలాగే నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర అప్పులు చేయను. కేవలం ముగ్గురి దగ్గర మాత్రమే.. నా మేనేజర్ దగ్గర,నా ఫ్రెండ్,అలాగే రెజీనా..

ఓ సారి నేను ఇబ్బందుల్లో ఉన్నాను అని తెలుసుకొని ఐదు లక్షలు నన్ను అడగకుండానే ఇచ్చింది రెజినా..నాకు ఎవరి దగ్గర అప్పులు అడగడం ఇష్టం ఉండదు. కేవలం నాకు దగ్గరైన వారిని మాత్రమే అప్పు అడుగుతాను.అలాగే రెజీనాకు నాకు మధ్య ఏమీ లేదు అని చెప్పారు సందీప్ కిషన్. అయితే బెస్ట్ ఫ్రెండ్ అని సందీప్ కిషన్ చెప్పడంతో బెస్ట్ ఫ్రెండ్ బెట్టర్ ఆఫ్ కాకూడదా అని యాంకర్ అడగగా.. అలాంటి ఉద్దేశం నాకు ఆ హీరోయిన్ మీద లేదు అని క్లారిటీ ఇచ్చారు. మరి రెజీనా సందీప్ కిషన్ కి ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ గానే ఉంటుందా లేక బెట్టర్ ఆఫ్ అవుతుందా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.(Sundeep Kishan)