Soundarya: తండ్రి మీద ప్రేమతో సౌందర్య అలాంటి పని చేసిందా.. నిజంగా గ్రేట్.?
Soundarya: తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు సావిత్రికి ఎలాంటి క్రేజ్ ఉండేదో మనం వార్తల్లో వింటూనే ఉంటాం.. ఆమె నటన గురించి మాటల్లో చెప్పలేం.. ఆమె ముఖ కదలికల ద్వారా ఎంతో బాగా నటించేదట.. అలాంటి సావిత్రి మరణం తర్వాత ఆ విధంగా నటించి పేరు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య అని చెప్పవచ్చు.. ఒకప్పుడు సావిత్రి డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు ఏ విధంగా ఎదురు చూసేవారో సౌందర్య కూడా ఆ విధంగానే ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగి హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్నదని చెప్పవచ్చు..

Did Soundarya do such a thing out of love for her father
అలాంటి సౌందర్య కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా ఒక సినిమాలో నటించి తన సినిమాని తానే నిర్మాణం చేసుకుందట.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. సౌందర్య తండ్రి సత్యనారాయణ అయ్యారు కన్నడ ఇండస్ట్రీలో దర్శకుడిగా, నిర్మాతగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు తీస్తున్న తరుణంలో ఒక క్యారెక్టర్ కోసం అమ్మాయిని వెతుకుతున్నారట.. (Soundarya)
Also Read: Tamannaah: భర్తతో ఎఫైర్ పెట్టుకుందని తమన్నా ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన హీరో భార్య.?
అప్పుడు స్కూల్ చదువుతున్నటువంటి సౌందర్యను తీసుకువచ్చి ఆ క్యారెక్టర్ లో చేయించారట.. దీంతో ఆమెకు మంచి పేరు రావడమే కాకుండా అప్పటినుంచి వరుస అవకాశాలు వచ్చాయట.. అలా సౌందర్య తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి స్టార్ గా ఎదిగిందని చెప్పవచ్చు.. సినిమాలు చేస్తున్న సమయంలోనే సౌందర్య తండ్రి సత్యనారాయణ మరణించారు..

ఆయనకు గుర్తుగా ఏదైనా చేయాలనుకున్న సౌందర్య సత్య మూవీ మేకర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి 2002లో తీవు అనే చిత్రాన్ని తీశారు.. సినిమా సూపర్ హిట్ అవ్వడమే, కాకుండా అప్పట్లో ఈ చిత్రం 2 జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది.. అలాంటి సౌందర్య మంచి పొజిషన్ లో ఉన్న సమయంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరం.(Soundarya)