Sreeleela Oscar Comments: మేకింగ్ వీడియోలో శ్రీలీల ఆస్కార్ కామెంట్.. నెటిజన్ల రియాక్షన్!!

Sreeleela Oscar Comments: నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నుండి మేకింగ్ వీడియో విడుదలైంది. మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Heroine Sreeleela oscar comments
సెట్లో సంతోషకరమైన వాతావరణం, కాస్టింగ్ & టెక్నీషియన్ల మధ్య ఉన్న మంచి బాండింగ్ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీలీల ఫన్నీగా “నాకు ఆస్కార్ రావాలి” అనడం, మైక్ పట్టుకుని పాట పాడటం, నితిన్ తనదైన శైలిలో సరదాగా చమత్కరించడం వంటి సన్నివేశాలు నెటిజన్లను అలరిస్తున్నాయి.
‘రాబిన్ హుడ్’ కథానాయకుడిగా నితిన్ హనీ సింగ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ధనవంతులను దోచుకునే పాత్రలో ఆయన నటిస్తుండగా, శ్రీలీల ఓ ధనవంతురాలిగా కనిపించనుంది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మైమ్ గోపీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా కి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. “ఇది కేవలం ప్రారంభం మాత్రమే” అంటూ మేకర్స్ థియేటర్లలో మరో 30 రోజుల్లో ఎంటర్టైనింగ్ అడ్వెంచర్ ప్రారంభం కానుంది అని పేర్కొన్నారు. 2020లో ‘భీష్మ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నితిన్-వెంకీ కుడుముల కాంబో మళ్లీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.