Ibrahim Zadran: రికార్డుల వరద పారిస్తున్న ఇబ్రహీం జద్రాన్.. మాజీల రికార్డులు గల్లంతు!!

Ibrahim Zadran: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ ఆశలను ముగించింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) రికార్డు ఇన్నింగ్స్. 146 బంతుల్లో 177 పరుగులు చేసిన జద్రాన్, ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తు చేశాడు. ఆరు సిక్సులు, 12 ఫోర్లతో విరుచుకుపడ్డ జద్రాన్, ఆఫ్గాన్‌కు 325 పరుగుల భారీ స్కోర్ అందించాడు.
Ibrahim Zadran Hits 177 in CT 2025
ఇంగ్లాండ్ భారీ లక్ష్యాన్ని చేధించేందుకు ప్రయత్నించినా ఓపెనర్లు త్వరగా అవుట్ కావడంతో ఒత్తిడిలో పడింది. జో రూట్ (120) పోరాడినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. జోస్ బట్లర్ (38), బెన్ డెక్కట్ (38) మాత్రమే కొన్ని పరుగులు చేశారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. అఫ్గాన్ బౌలర్ అజ్మతుల్లాహ్ ఒమర్ జామ్ (5 వికెట్లు) కీలక భూమిక పోషించాడు.
ఈ మ్యాచ్‌లో జద్రాన్ రికార్డులు సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డెక్కట్ (165) రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా, ఐసీసీ టోర్నమెంట్లో 150+ స్కోరు చేసిన చిన్న వయస్కుడిగా (23 ఏళ్లు) కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇబ్రహీం జద్రాన్‌కు ఇది ఆరో వన్డే సెంచరీ.
ఈ విజయంతో అఫ్గాన్ జట్టు ఐసీసీ టోర్నమెంట్‌లో తన అత్యధిక స్కోరు నమోదు చేసింది. సెమీఫైనల్ పోరుకు అఫ్గానిస్థాన్ మరింత ముమ్మరంగా సన్నద్ధమవుతోంది. ఈ టోర్నమెంట్లో అఫ్గాన్ క్రికెట్ తుఫాన్ కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.