Sreeleela: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి శ్రీలీల ప్రవేశించిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. “పెళ్లి సందD” సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆమె, వరుస అవకాశాలతో దూసుకుపోతూ, స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది. తన అందం, అభినయంతో పాటు అద్భుతమైన నృత్యాలు, స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా కుర్రకారును ఆకట్టుకొని, వారి హృదయాల్లో స్థానం సంపాదించింది.
Sreeleela Paris Photos with a Mystery Man Go Viral
శ్రీలీల మొదటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించాయి. అయితే ఆ తరువాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. అయినా, శ్రీలీల క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా, దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. శ్రీలీల సినిమాలో ఉన్నదంటే హిట్ అవుతుందని ఇండస్ట్రీలో బలమైన నమ్మకం ఉంది. ఆమె ఎనర్జీతో స్టార్ హీరోలకు కూడా పోటీగా నిలుస్తోంది.
Also Read: Balakrishna: బాలయ్య కాంప్రమైజ్ అన్ని కోట్ల నష్టాన్ని మిగిలిస్తుందా?
తాజాగా శ్రీలీల విదేశీ పర్యటనకు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసక్తికరంగా, ఈ పర్యటనలో శ్రీలీల ఒంటరిగా కాకుండా తన ప్రియుడితో కలిసి వెళ్లిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పారిస్‌లోని ఒక ఫోటోలో ఆమె ఓ అబ్బాయితో మాట్లాడుతున్నట్లు కనిపించడంతో నెటిజన్లు అతనెవరో గుసగుసలు పెడుతున్నారు.
అయితే మరికొందరు ఆ అబ్బాయి శ్రీలీల స్నేహితుడు లేదా బంధువు అయ్యుండొచ్చని, యాదృచ్ఛికంగా కలిసి మాట్లాడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలపై నిజమెంత అనేది శ్రీలీల స్పందిస్తే మాత్రమే తెలుస్తుంది. మరి ఈ ప్రచారానికి ఆమె ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.