Prabhas: మోహన్ బాబు దెబ్బకు చుక్కలు చూసిన ప్రభాస్.. ఏం చేశాడంటే..?
Prabhas: మోహన్ బాబు ప్రభాస్ కాంబినేషన్లో బుజ్జిగాడు సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి ప్రభాస్ మోహన్ బాబుని బావ బావ అని పిలవడం మొదలు పెట్టారట. ఎందుకంటే ప్రభాస్ మోహన్ బాబు కలిసి నటించిన బుజ్జిగాడు సినిమాలో త్రిష అన్నయ్య పాత్రలో మోహన్ బాబు నటించారు.షూటింగ్లో భాగంగా బయట కూడా అలా బావ అని పిలవడం ప్రభాస్ కి అలవాటైపోయిందట.

Prabhas was shocked by Mohan Babu
అయితే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకి మోహన్ బాబుకి చాలా దగ్గరి అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ తో కృష్ణంరాజు రాసుకున్న కన్నప్ప కథను కూడా మంచు విష్ణు కోసం మోహన్ బాబుకి ఇచ్చేసారట. అంత మంచి బాండింగ్ ఉంది వీరి మధ్య. అంతే కాదు కన్నప్ప మూవీలో విష్ణు అడిగిన మొదటి సారికే ప్రభాస్ ఓకే చేశారట. (Prabhas)
Also Read: Chiranjeevi: హీరోయిన్ చీరలోపల చెయ్యి.. అందరి ముందే చిరంజీవి ఫ్రెండ్ ని కొట్టిన హీరోయిన్.?
అయితే మొదట ఈ విషయం గురించి ప్రభాస్ ని అడగడం కోసం మోహన్ బాబు స్వయంగా ప్రభాస్ కి కాల్ చేసారట.ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే గజగజ వణుకుతూ చెప్పండి అని అడగగా నువ్వు కన్నప్ప మూవీలో నటించాలి అని మోహన్ బాబు చెప్పాడట. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఓకే నటిస్తాను అని చెప్పారట.అయితే మోహన్ బాబు ఫోన్ చేయడంతో ప్రభాస్ చాలా వణికిపోయాడట.

అంతేకాదు ఆ తర్వాత విష్ణు కి కాల్ చేసి సినిమా గురించి అయినా లేక ఇంకేదైనా విషయం ఉంటే నువ్వే నాకు కాల్ చేసి చెప్పు నాన్నగారు నాకు కాల్ చేస్తే మాట్లాడానికి చాలా భయం అవుతుంది. ఏదైనా విషయం ఉంటే ఇప్పటినుండే నువ్వే నాకు చెప్పు అని ప్రభాస్ భయపడుకుంటూ చెప్పారట. అయితే విష్ణు ఈ విషయాన్ని రీసెంట్గా ఇంటర్వ్యూలో చెబుతూ నాన్నగారు ఫోన్ చేస్తే ప్రభాస్ భయపడ్డారని,ఏదైనా ఉంటే నువ్వే చెప్పు అని నాకు చెప్పారంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక విష్ణు మాటలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో ప్రభాస్ కి పెద్దవాళ్ళు అంటే ఎంత గౌరవమో ఈ ఒక్క మాటతో అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Prabhas)