Teenamar Mallanna: తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ ?
Teenamar Mallanna: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గట్టి షాక్ తగిలింది. తీన్మార్ మల్లన్న ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. గత కొన్ని రోజులుగా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న… తనకు నచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. ప్రతి పక్షాలను టార్గెట్ చేయకుండా.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని తిట్టారు.

Congress suspended Teenamar Mallanna
ఈ తరుణంలోనే.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై చాలా ఫిర్యాదులు ఏఐసీసీకి అందాయి. ఇక తాజాగా మీనాక్షి నటరాజన్ ఇన్ ఛార్జిగా రాగానే… తీన్మార్ మల్లన్న ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక అటు.. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రియాక్ట్ అయ్యారు.
BRS: గూడెం మహిపాల్ రెడ్డి యూ టర్న్.. KCR స్కెచ్ అదుర్స్ ?
పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని…. మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామన్నారు. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందని… మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పన్నారు. పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.