Balakrishna: ఆ సినిమా డిజాస్టర్ అంటూ బాలకృష్ణను అవమానించిన నిర్మాత.?
Balakrishna: ఏంటి బాలకృష్ణ నటించిన ఆ సినిమా డిజాస్టర్ అని నిర్మాత ఒప్పుకున్నారా.. ఇది నిజమైతే బాలకృష్ణని ఆయన అభిమానులని ఆ నిర్మాత అవమానించినట్టే.. మరి ఆ సినిమా డిజాస్టర్ అంటే అభిమానులు ఒప్పుకుంటారా..మరి ఇంతకీ బాలకృష్ణ సినిమా డిజాస్టర్ అని ఒప్పుకున్న ఆ నిర్మాత ఎవరో ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా అందరూ చూసే ఉంటారు.

The producer insulted Balakrishna
అయితే ఈ సినిమా వీడుదలకు ముందే నిర్మాత నాగ వంశీ భారీ హైప్ క్రియేట్ చేశారు. కానీ నాగవంశీ చెప్పినంతగా సినిమా లేదు.మొదటి రెండు మూడు రోజులు ఈ సినిమా హవా కొనసాగినప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందు తేలిపోయింది అని చెప్పుకోవచ్చు. దాంతో నాగ వంశీ కూడా ఈ సినిమా గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు.(Balakrishna)
Also Read: Samantha Fitness Video: సమంత వర్కవుట్ వీడియో.. కొత్త ప్రాజెక్టులకు హింట్?
అయితే తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ఈవెంట్లో నాగ వంశీ తన డాకు మహారాజ్ మూవీ రిజల్ట్ గురించి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. డాకు మహారాజ్ సినిమా అనుకున్నంత హిట్ అయితే కాలేదు.కలెక్షన్లు ఎక్కువగా రాలేదు. కానీ మూవీ మాత్రం ఫర్వాలేదు అనిపించింది.. అంటూ మొదటిసారి డాకు మహారాజ్ రిజల్ట్ పై స్పందించారు.

అయితే ఏది ఏమైనప్పటికీ సినిమా కలెక్షన్స్ రాలేదు అంటే డిజాస్టర్ అన్నట్లే అంటూ నాగ వంశీ మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. స్వయంగా నాగ వంశీ డాకు మహారాజ్ మూవీ డిజాస్టర్ అని ఒప్పుకున్నాడు అంటూ కొంతమంది నెటిజన్స్ ఈ పోస్టులను వైరల్ చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ భారీ అంచనాలతో వచ్చిన డాకు మహారాజ్ మూవీ కలెక్షన్స్ పరంగా నిర్మాతలను నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు.(Balakrishna)