Vishnu: జనరేటర్ లో చక్కెర.. మనోజ్ చావు కోసమే.. విష్ణు షాకింగ్ కామెంట్స్.?
Vishnu: మంచు ఫ్యామిలీ గురించి ఈ మధ్యకాలంలో ఎన్నో వార్తలు నెట్టింట్లో హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మంచు ఫ్యామిలీకి సంబంధించిన గొడవలే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ప్రతిసారి మంచు విష్ణు నన్ను చంపాలని చూస్తున్నాడని, ఎక్కడ దొరికితే అక్కడ నన్ను లేపేస్తాడని,ఒక్కడే హ్యాపీగా ఉందామని చూస్తున్నాడని ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

Vishnu shocking comments on sugar in the generator
అంతేకాదు ఆ మధ్యకాలంలో మంచు మనోజ్ తన ఇంట్లో పార్టీ చేసుకుంటున్న సమయంలో జనరేటర్ లో చక్కెర పోసి నన్ను నా ఫ్యామిలీని అంతమొందించాలని చూశాడని మమ్మల్ని చంపాలని చూస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన సంగతి కూడా మనకు తెలిసిందే.అయితే తాజాగా జనరేటర్ లో చక్కెర పోయడం గురించి షాకింగ్ రిప్లై ఇచ్చారు మంచు విష్ణు.. మరి ఇంతకీ జనరేటర్ లో చక్కెర పోయడం గురించి మంచు విష్ణు ఏం చెప్పారు..ఎందుకు పోసారో ఇప్పుడు చూద్దాం.. (Vishnu)
Also Read: Samantha: ఆ టాలీవుడ్ డైరెక్టర్ కాపురంలో నిప్పులు పోసిన సమంత..?
ప్రస్తుతం మంచు విష్ణు తన కన్నప్ప మూవీకి సంబంధించి పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ప్రమోషన్స్ చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆస్క్ మీ అనే సెషన్ నిర్వహించడంతో చాలామంది నేటిజన్స్ మంచు విష్ణుని ఎన్నో ప్రశ్నలు అడిగారు. వాటికి మంచు విష్ణు చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ఎందుకు విష్ణు అన్నా మీరు జనరేటర్ లో పంచదార కలిపారు అని ప్రశ్నించగా..

ఇంజన్ లో పంచదార కలిపితే మైలేజ్ ఎక్కువగా వస్తుందని చదివా అందుకే అలా చేశాను అంటూ మంచు విష్ణు ఫన్నీ రిప్లై ఇచ్చారు.ఆయన రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ వెరైటీ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ గొడవలు ఎప్పుడు ఆగిపోతాయో అని మంచు ఫ్యామిలీ అభిమానులు బాధపడుతున్నారు.అటు మోహన్ బాబు ఫ్యామిలీ కూడా మంచు మనోజ్ వల్ల సఫర్ అవుతుంది.కానీ మనోజ్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు పది రోజులకు ఒకసారి ఏదో ఒక కొత్త గొడవ సృష్టిస్తున్నారు.(Vishnu)