Posani Krishna Murali: వెధవ డ్రామాలు ఆడుతున్నాడు.. పోసానిపై సీఐ ఫైర్.?


Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని రీసెంట్ గా ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే వైసిపి ప్రభుత్వం లో ఈయన చంద్రబాబుపై,లోకేష్ పై,వాళ్ళ భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈయన వాళ్ళను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కొంతమంది పోసాని కృష్ణ మురళి పై కేసు ఫైల్ చేశారు. కానీ వైసీపి ప్రభుత్వంలో ఈయన్నీ ఏమీ అనకపోయినప్పటికీ ఆ కేసులు మళ్లీ తవ్వి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన్ని అరెస్ట్ చేశారు.

CI Fire to Posani Krishna Murali

CI Fire to Posani Krishna Murali

అయితే అరెస్టు చేశాక పోలీసులు విచారించగా.. ఆయన సినిమాటిక్ స్టైల్లో ఆన్సర్లు ఇచ్చారని,అచ్చం టెంపర్ సినిమాలో చేసినట్టే ప్రవర్తించాడని ఇలా ఎన్నో వార్తలు మీడియాలో వినిపించాయి.అయితే తాజాగా పోసానికి తీవ్ర అస్వస్థత అని,ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ వార్తలు వినిపించాయి.ఛాతి నొప్పి అంటూ పోసాని కృష్ణమురళి పోలీసులకు చెప్పడంతో వెంటనే పోలీసులు రాజంపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. (Posani Krishna Murali)

Also Read: Alia Bhatt: సైఫ్ అలీ ఖాన్ వల్ల తన కూతుర్ని దాచేసిన అలియా భట్.. కారణం..?

అక్కడ అన్ని టెస్టులు చేయించి ఆ తర్వాత కడపలో ఉన్న రిమ్స్ కి తరలించి అక్కడ కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారట.అయితే రెండు మూడు సార్లు వైద్య పరీక్షలు చేయించినా కూడా పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగానే ఉందని,ఆయన ఆరోగ్యానికి ఏమీ కాలేదని ఛాతి నొప్పి రాలేదని పరీక్షలు చేసిన వైద్యులు తేల్చి చెప్పారట.

CI Fire to Posani Krishna Murali

దీంతో ఫైర్ అయిన సిఐ పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగానే ఉంది. కానీ ఆయనే ఛాతి నొప్పి వస్తుంది అని చెప్పి పెద్ద డ్రామాలు ఆడాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడడం లేదు.ఇంకొన్ని వైద్య పరీక్షల రిజల్ట్స్ వచ్చాక వెంటనే ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తీసుకెళ్తాము అంటూ సీఐ తేల్చి చెప్పారు.(Posani Krishna Murali)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *