Adi Pinishetty: ఆ సినిమా షూట్ లో దొంగతనం చేసిన ఆది పినిశెట్టి.. అంత నీచమా.?


Adi Pinishetty: ఏంటి ఆది పినిశెట్టి దొంగతనం చేయడమా.. అది కూడా ఓ సినిమా షూటింగ్ సెట్లో.. మరి ఇంతకీ ఆది పినిశెట్టి దొంగతనం చేసిన ఆ వస్తువు ఏంటి..ఎందుకు అలాంటి నీచమైన పని చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. కొంతమంది హీరోలు అప్పుడప్పుడు షూటింగ్స్ లో చేసిన చిలిపి పనులను బయటపెడుతూ ఉంటారు. అలా చిలిపి పనుల్లో భాగంగా సిల్లీగా కొన్ని చిన్న చిన్న వస్తువులను దొంగతనం కూడా చేస్తూ ఉంటారు.

Adi Pinishetty who stole in the shoot of the movie

Adi Pinishetty who stole in the shoot of the movie

అలాంటి వారిలో ఆది పినిశెట్టి కూడా ఒకరు. ఎందుకంటే ఈయన సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రాంచరణ్ హీరోగా చేసిన రంగస్థలం సినిమా నుండి ఓ వస్తువుని కొట్టేసారట.మరి ఇంతకీ ఆ వస్తువు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆది పినిశెట్టి నటించిన శబ్దం మూవీ తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆది పినిశెట్టి ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు. (Adi Pinishetty)

Also Read: Rana Daggubati: బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న రానా దగ్గుబాటి.. ఇంత చెత్త నిర్ణయం ఎలా.?

ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మీరు రంగస్థలం సినిమాలో నటించారు కదా.. ఆ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పండి అని యాంకర్ అడగగా.. ఈ సినిమాలో నటించడం ఒక మంచి అనుభవం.ఇందులో నేను రాంచరణ్ కి అన్న క్యారెక్టర్ లో నటించాను. అయితే ఈ సినిమా షూట్ సమయంలో నేను ఒక చిలిపి పని చేశాను.అది కూడా దొంగతనం. ఇక నేను ఆ సినిమా షూటింగ్ నుండి నేను పెట్టుకున్న కళ్ళజోడుని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఇంటికి తీసుకోవచ్చుకున్నాను.

Adi Pinishetty who stole in the shoot of the movie

అయితే ఇప్పటివరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. నేను బయట పెడితేనే ఈ విషయం ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతుంది. మామూలుగా నాకు కళ్ళజోడు పెట్టుకునే అలవాటు లేదు. కానీ రంగస్థలం సినిమాలో క్యారెక్టర్ లో భాగంగా కళ్ళజోడు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక కళ్ళజోడు నాకు బాగా నచ్చడంతో ఎవరికి చెప్పకుండా కళ్ళజోడుని నేను దొంగతనం చేసి ఇంటికి తెచ్చుకున్నాను అంటూ ఆది పినిశెట్టి రంగస్థలం సినిమా షూట్ సమయంలో చేసిన దొంగతనాన్ని బయట పెట్టారు.(Adi Pinishetty)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *