Social Media Reacts to Chandrababu Naidu Statements

Chandrababu Naidu: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాటలతో ప్రజల మనస్సుల్లో అనేక సందేహాలను కలిగిస్తున్నారు. ఆయన మాటలు వింటే, ఈ ప్రపంచంలో అన్నీ ఆయనే సాధించారేమో అనిపిస్తుంది. ఎవరు ఏమనుకున్నా, చంద్రబాబు తనదైన శైలిలో చెప్పాల్సింది చెబుతూనే ఉంటారు, అలాగే అది నిజమని ప్రజలలో నాటుకునేలా ప్రయత్నిస్తారు.

Social Media Reacts to Chandrababu Naidu Statements

ఇటీవల అమరావతిలో పనుల ప్రారంభోత్సవం సందర్భంగా, ఆయన హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడారు. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశాన” అని ఆయన గట్టిగా చెప్పారు. అయితే, “హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దాన” అన్న మాటపై చర్చలు జరుగుతున్నాయి. 2004లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినప్పటి నుండి, హైదరాబాద్ ఇప్పటికీ నంబర్ వన్ సిటీగా ఉండటం లేదు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

Also Read: Chandrababu Naidu: పార్టీ నేతల విషయంలో చంద్రబాబు మెతక విధానం.. టీడీపీ కొంప ముంచుతుందా?

హైదరాబాద్‌కు 400 ఏళ్ల చరిత్ర ఉంది, మరియు దాని అభివృద్ధి అనేక మంది కలిసిమెలిసి చేసిన ప్రయత్నం. అందులో చంద్రబాబుకి కూడా పాత్ర ఉంది, కానీ తానే పూర్తి అభివృద్ధి చేశానని చెప్తున్నందుకు విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు అని ఆయన చెప్పినప్పుడు, ఇప్పుడు ఆయన అభివృద్ధిని తన దేనిగా చెప్తున్నారంటే, అది నిజంగా ప్రశ్నార్థకంగా మారుతోంది.

హైదరాబాద్ అభివృద్ధి దశలవారీగా జరిగింది, అందులో అందరి పాత్ర ఉంది. ఐటీ రంగం విస్తరించినప్పుడు, నగరం అభివృద్ధి చెందింది. ఈ సందర్భంలో, చంద్రబాబు అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడటానికి, హైదరాబాద్‌ను అనవసరంగా ప్రస్తావించడం అనేది విమర్శలకు దారితీస్తోంది.