BJP: బిజెపి పార్టీలోకి రేవంత్, డీకే శివకుమార్?
BJP: దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ వ్యాపిస్తోంది. శత్రువులను కూడా తమ పార్టీలో కలుపుకొని… అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని నరేంద్ర మోడీ టీం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేసిన మోడీ టీం… ఎప్పుడు తెలంగాణ అలాగే కర్ణాటక పై కన్ను వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Revanth, DK Shivakumar in BJP party
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్… ఇద్దరు లీడర్లను బిజెపి టార్గెట్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఇద్దరినీ తమ పార్టీలో చేర్చుకొని కర్ణాటక అలాగే తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.
అప్పట్లో ఏక్ నాథ్ షిండే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని చీల్చినట్లు… ఈ రెండు రాష్ట్రాల్లో వీళ్ళతో ప్రభుత్వాన్ని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. దానికి తగ్గట్టుగానే బిజెపి పార్టీకి అనుకూలంగా ఈ ఇద్దరు నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇక దీనిపై.. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తలపై ఇద్దరు లీడర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.