Anasuya: యాంకర్ అనసూయ అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఈమె ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా యాంకర్ గా గుర్తింపు సంపాదించి ప్రస్తుతం సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.ముఖ్యంగా ఈమె చేసిన రంగమ్మత్త, ద్రాక్షాయిణి పాత్రలకు ఎంతో మంది ఆడియన్స్ ఫిదా అయ్యారు. అలాంటి యాంకర్ అనసూయ రంగమ్మత్తగా ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయింది.
Is that director Anasuya first husband
ఇక సినిమాలోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండేది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటేనే ఉంటుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ కి ఈమెకి మధ్య ఓ ఇష్యూ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే తాజాగా అనసూయ గురించి ఒక షాకింగ్ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే అనసూయ మొదటి భర్త డైరెక్టర్ అంటూ ఒక పోస్ట్ వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్స్ చాలా షాక్ అవుతున్నారు. (Anasuya)
Also Read: ANR: థియేటర్లో అమ్మాయితో దొరికిపోయిన ఏఎన్ఆర్.. భార్య రియాక్షన్ ఏంటంటే..?
ఇక అసలు విషయం ఏమిటంటే.. బేబీ సినిమా ద్వారా డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించిన సాయిరాజేష్ అందరికి తెలిసే ఉంటారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో ఈయన స్టార్ అయిపోయారు. అయితే అలాంటి బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ అనసూయ మొదటి భర్త అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం గతంలో అనసూయ జబర్దస్త్ షో చేసిన సమయంలో సాయి రాజేష్ అనసూయతో ఫోటో దిగి నెట్టింట్లో షేర్ చేశాడట.
అయితే ఈ ఫోటో చూసిన చాలామంది నెటిజన్స్ వీడు అనసూయ భర్తనా..ఏంటి ఇలా బండగా నల్లగా ఉన్నాడు.. ఆ అమ్మాయేమో అంత బాగుంది..వీడేంటి ఇలా ఉన్నాడు అని బండబూతులు తిట్టారు. అంటూ సాయి రాజేష్ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.అయితే ఈ మాటలు విన్న అనసూయ నాకు కూడా ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదే అంటూ షాక్ అయింది. ఇక ఈ విషయాలన్నీ రాకింగ్ రాకేష్ హీరోగా చేసిన కేసీఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడారు.(Anasuya)