BRS: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం,?


BRS: గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై…. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అలాగే అసెంబ్లీ కార్యదర్శి… ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ప్రతి వాదులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది.

Supreme Court’s sensational decision against 10 BRS MLAs who switched parties

ఈ నెల 22వ తేదీ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు మార్చి 25వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గావాయ్ వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. రీజనబుల్ టైం అంటే గడువు ముగిసే వరకా? ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి? అంటూ నిలదీసింది సుప్రీంకోర్టు.

ఎంత సమయం కావాలో చెప్పండి… ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదు… అంటూ గావాయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీరు చూస్తుంటే ఈనెల 25వ తేదీన 10 మంది ఎమ్మెల్యేలపై కచ్చితంగా వేటుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *