Thati kallu: ఎండాకాలంలో తాటికల్లు తాగుతున్నారా.. కాస్త జాగ్రత్త?
Thati kallu: ఎండాకాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. మధ్యాహ్నం బయటికి అడుగు పెట్టలేని పరిస్థితిలు ఉన్నాయి. అంతేకాదు… ఉదయం తొమ్మిది దాటిందంటే ఎండ గట్టిగానే కొడుతోంది. అయితే ఈ ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చాలామంది… తాటికల్లు తాగితే మంచిదని తాగేస్తూ ఉంటారు.

Do you drink dates in summer
అయితే తాటికల్లు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఉదయం పూట… దించిన తాటికలు మాత్రమే తాగాలని చెబుతున్నారు. అదే మధ్యాహ్నం పూట కళ్ళు తాగితే… కడుపులో గ్యాస్ ఫామ్ కావడమే కాకుండా విరేచనాలు విపరీతంగా చోటు చేసుకుంటాయని… వార్నింగ్ ఇస్తున్నారు వైద్య నిపుణులు.
మధ్యాహ్నం కాకుండా ఉదయం పూట ఎనిమిది గంటలలోపు ఈ తాటికల్లు తాగితే… లోపల ఎలాంటి వ్యర్ధపదార్థాలు ఉన్న తొలగిస్తుంది. ముఖ్యంగా ఈత కల్లు తాగితే కిడ్నీ స్టోన్స్ కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. విపరీతంగా తాటికల్లు తాగకుండా మోతాదులో రోజు తాగిన పర్వాలేదని చెబుతున్నారు. ఇక ఈ తాటికల్లు ఎండాకాలంలో తాగితే గ్యాస్ అలాగే మలబద్ధక సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుందని చెబుతున్నారు. కాబట్టి తాటికల్లు తాగే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.