Meenakshi Natarajan: రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరు పెట్టిన మీనాక్షి నటరాజన్?


Meenakshi Natarajan: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను… అమలుపరచడంలో విఫలమైందని.. జోరుగా జనాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు.

Meenakshi Natarajan who replaced Revanth Reddy

ఆమె వచ్చి రాగానే తీన్మార్ మల్లన్న పై వేటు వేయడం… అలాగే అటు వి హనుమంతరావు లాంటి వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పార్టీ లైన్ దాటితే వాత తప్పదని ఆమె చెప్పకనే చెప్పారు. ఇక ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మొన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాల నేపథ్యంలో రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ అనుకుంటోందట.

BRS: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం,?

ఒకవేళ దింపితే… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా… చూసుకునేలా మీనాక్షి నటరాజన్ కు రాహుల్ గాంధీ బాధ్యతలు అప్పగించారట. అందుకే ఆమె స్పెషల్ గా తెలంగాణకు రావడం జరిగిందని చెబుతున్నారు. బిజెపిలోకి రేవంత్ రెడ్డి వెళ్లినా కూడా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకునేలా ఆమె చర్యలు తీసుకుంటున్నారట. మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *