IND VS NZ: టీమిండియా కు ఆదివారం గండం… గత గత వణుకుతున్న ఫ్యాన్స్..?
IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ఆదివారం అంటే మార్చి 9వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ లోని అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Sunday Tension For IND VS NZ CT 2025 Final
అయితే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోతుందని ఫాన్స్ అంటున్నారు. ఎందుకంటే గతంలో ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లన్ని ఆదివారం జరిగితే టీమిండియా ఓడిపోయిన రికార్డులు ఉన్నాయి. అందుకే మార్చి 9వ తేదీన జరిగే మ్యాచ్ కూడా ఓడిపోయే ప్రమాదం పొంచి ఉందని భయపడిపోతున్నారు.
కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఆదివారం జరగబోతున్న మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్పోర్ట్స్ 18 తో పాటు స్టార్ స్పోర్ట్స్ లో కూడా వస్తుంది.